మిర్యాలగూడ:  తన తండ్రి మృతదేహం చూడలేదని మారుతీరావు కూతురు అమృత చెప్పా,రు. మారుతీరావు అంత్యక్రియల సమయంలో అమృత  స్మశానవాటికకు చేరుకొంది మారుతీరావు అంత్యక్రియల సమయంలో అమృత  స్మశానవాటికకు చేరుకొంది. ఈ సమయంలో అమృత గో బ్యాక్ అంటూ నినాదాలు చేశారు. దీంతో అమృతను పోలీసులు ఇంటికి తీసుకొచ్చారు.

ప్రణయ్ హత్య కేసులో నిందితుడుగా ఉన్న  మారుతీరావు హైద్రాబాద్ ఆర్యవైశ్య భవన్‌లో  ఈ నెల 8వ తేదీన ఆత్మహత్య  చేసుకొన్నాడు. ఆత్మహత్య చేసుకొన్న మారుతీరావు అంత్యక్రియలు మిర్యాలగూడలో సోమవారం నాడు నిర్వహించారు.

Also read:మిర్యాలగూడ స్మశాన వాటికలో ఉద్రిక్తత: అమృత గో బ్యాక్ అంటూ నినాదాలు

ఈ అంత్యక్రియలకు అమృత పోలీస్ రక్షణగా స్మశానవాటికకు చేరుకొన్నారు. మిర్యాలగూడ స్మశానవాటికలో మారుతీరావు మృతదేహాన్ని చూసేందుకు అమృత వెళ్లింది ఈ సమయంలో అక్కడే ఉన్న వారంతా అమృత గో బ్యాక్ అంటూ నినాదాలు చేశారు. అమృత గో బ్యాక్ అంటూ అమృత వైపుకు వచ్చే ప్రయత్నం చేశారు

ఈ సమయంలో అమృతకు  పోలీసుల రోప్ పార్టీ రక్షణగా నిలిచింది. మారుతీరావు మృతదేహం చూడకుండానే అమృత ఇంటికి  చేరుకొంది.  స్మశానవాటికలో ఏం జరిగిందో తనకు తెలియదన్నారు.  నాన్నను చూడలేదని ఆమె ఓ మీడియా ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారు.తాను కారులో ఉన్న సమయంలో ఏం జరిగిందో తనకు తెలియదన్నారు. నాన్నను చివరి చూపు చూడకుండానే వచ్చినట్టుగా ఆమె చెప్పారు.