Asianet News TeluguAsianet News Telugu

వీడని ముగ్గురి ఆత్మహత్య మిస్టరీ : ప్లాన్ ప్రకారమే

శ్రీకాంత్ గౌడ్ కుటుంబసమేతంగా ఆత్మహత్య చేసుకునేందుకు ముందుగానే పథకం వేసుకున్నాడా? అని పోలీసులు అనుమానిస్తున్నారు. అందుకు కొన్ని కారణాలు కనిపిస్తున్నాయి.  వాళ్ల ఇంటి పనిమనిషికి మంగళవారం సాయంత్రం శ్రీకాంత్ ఫోన్ చేసి ‘మేము ఊరికి వెళ్తున్నాం, రెండు రోజుల తర్వాత వస్తాం. మళ్ళీ ఫోన్ చేసే వరకు రావద్దు’ అని చెప్పాడు. పాలు పోసే వ్యక్తికి కూడా అదే రోజు ఫోన్ చేసి చెప్పాడు. 

Aminpur Suicide Case Mystery Update
Author
Hyderabad, First Published Jan 22, 2022, 8:27 AM IST

అమీన్ పూర్ : Aminpur పట్టణంలో ఒకే కుటుంబంలోని ముగ్గురు suicideకు పాల్పడటం గల కారణాలు అంతుచిక్కడం లేదు. గురువారం dead bodyలను పోలీసులు Patancheru Government Hospitalకి తరలించి Postmortem నిర్వహించి కుటుంబ సభ్యులకు అప్పగించారు. వారు మృతదేహాలను శామీర్ పేట మండలం తూంకుంట పట్టణం పోతాయ్ పల్లికి తీసుకువెళ్లారు. శుక్రవారం 11 గంటలకు కుటుంబ సభ్యులు, బంధువుల సమక్షంలో అంత్యక్రియలు నిర్వహించారు. ఇంటి నుంచి మృతదేహాలను తరలించే సమయంలో పోలీసులు మొబైల్ ఫోన్లు, లాప్టాప్లు స్వాధీనం చేసుకుని క్లూస్ టీమ్ కు అప్పగించారు. 

అయితే, ఆ రెండు ఫోన్లు పూర్తిగా ఫార్మేట్ చేసి ఉన్నాయి. ఎవరితోనైనా తగాదాలు ఉన్నాయా? ఆధ్యాత్మిక పరంగా ఏమైనా విశ్వాసాలు ఉన్నాయా? ఆర్థిక పరమైన ఇబ్బందుల ఉన్నాయా? అనే కోణంలో పోలీసులు విచారణ చేస్తున్నారు.

పథకం ప్రకారమే..
శ్రీకాంత్ గౌడ్ కుటుంబసమేతంగా ఆత్మహత్య చేసుకునేందుకు ముందుగానే పథకం వేసుకున్నాడా? అని పోలీసులు అనుమానిస్తున్నారు. అందుకు కొన్ని కారణాలు కనిపిస్తున్నాయి.  వాళ్ల ఇంటి పనిమనిషికి మంగళవారం సాయంత్రం శ్రీకాంత్ ఫోన్ చేసి ‘మేము ఊరికి వెళ్తున్నాం, రెండు రోజుల తర్వాత వస్తాం. మళ్ళీ ఫోన్ చేసే వరకు రావద్దు’ అని చెప్పాడు. పాలు పోసే వ్యక్తికి కూడా అదే రోజు ఫోన్ చేసి చెప్పాడు. 

సోషల్ మీడియా అకౌంట్ల తొలగింపు..
శ్రీకాంత్ గౌడ్ ఆత్మహత్యకు ముందే అతని ఫోన్,  భార్య Anamika  ఫోన్  లను పూర్తిగా ఫార్మాట్ చేశాడు. అతని లాప్టాప్ లో ఉన్న సమాచారం కూడా పూర్తిగా తొలగించాడు. ఇంటర్నెట్లో గూగుల్ సెర్చ్ లో ఉండే హిస్టరీని కూడా తొలగించాడు. ఫోన్లో ఉండే సిమ్ కార్డు కూడా తొలగించి కనిపించకుండా చేశాడు. ఫోన్ లలో డేటా లేకపోవడంతో విచారణ పోలీసులకు ఇబ్బందిగా మారింది. 

నిపుణుల సహకారంతో  డేటాను సేకరించే పనిలో పోలీసులు ఉన్నారు. ఇంట్లో ఉన్న ఫోటోలు బోర్లా పడి ఉండటం, మృతిచెందిన వారి ముఖాలపై పెద్ద తిలకం బొట్టు ఉండడంతో, పోలీసులు వీరికి ఆధ్యాత్మికంగా ఏమైనా నమ్మకాలు ఉన్నాయా? అనే కోణంలో విచారించినట్లు తెలిసింది. కొందరు.. కుటుంబీకులు ఎవరైనా మరణిస్తే ఇంట్లో  దేవుడి పటాలను తిరగేసి ఉంచుతారని తెలుసుకున్నారు.

రుణభారం తోనే..
శ్రీకాంత్ గౌడ్ కుటుంబంతో సహా ఆత్మహత్య చేసుకోవడానికి ఆర్థిక పరమైన అంశాలే కారణం కావచ్చునని పోలీసులు అంచనా వేస్తున్నారు. ఇంటి కొనుగోలుకు బజాజ్ ఫైనాన్స్ లో రూ. 30 లక్షల రూపాయల హౌసింగ్ లోన్ తీసుకున్నాడు. ఇంటిపై అంతస్తు నిర్మాణం సమయంలో రూ.11లక్షల టాప్అప్ రుణం తీసుకున్నాడు.  మరో ఏడు లక్షల వ్యక్తిగత రుణాలు కూడా తీసుకున్నట్లు గుర్తించారు. 

ఇదిలా ఉండగా, హైదరాబాద్ లోని Aminpurలో శుక్రవారం విషాదం నెలకొంది. వారిద్దరి కులాలు వేరైనా ప్రేమించి, పెళ్లి చేసుకున్నారు. వారిద్దరి అనురాగానికి గుర్తుగా  ఏడేళ్ల కుమార్తె కూడా ఉంది. ఇంతలో ఏం జరిగిందో తెలియదు. రెండు రోజులుగా కనిపించడం లేదని అందిన ఫిర్యాదు మేరకు పోలీసులు రంగంలోకి దిగారు. అనుమానంతో ఇంటి తలుపులు తెరిచి చూడగా.. ఏడేళ్ల కూతురితో కలిసి తల్లి నురగలు కక్కుతూ మంచంపై విగత జీవులుగా కనిపించగా.. తండ్రి  ఉరి వేసుకుని suicide చేసుకున్నాడు. ఈ విషాద ఘటన Sangareddy District అమీన్పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది.

Follow Us:
Download App:
  • android
  • ios