Asianet News TeluguAsianet News Telugu

సికింద్రాబాద్ లేదా మల్కాజ్‌గిరిపై గురిపెట్టిన కిషన్ రెడ్డి.... అయినా అంబర్ పేటను వదలరా?

చాలా ఏళ్లు ఆయన బిజెపి రాష్ట్ర అధ్యక్షునిగా పనిచేశారు. ఎమ్మెల్యేగా వరుస విజయాలతో మంచి రాజకీయ నాయకుడిగా పేరు తెచ్చుకున్నారు. నియోజక వర్గ ప్రజలతో ఎల్లపుడూ అందుబాటులో ఉంటూ నాయకుడంటే ఇలా ఉండాలని అనిపించుకున్నారు. అసెంబ్లీ లో బిజెపి సభాపక్ష నాయకుడిగా మంచి స్ధానంలో ఉన్నారు. అయినా ఇవేవి ఆయనకు సంతృప్తినివ్వనట్లున్నాయి. రాష్ట్ర స్థాయి నేతగా ఇన్నాళ్లు రాజకీయాలు చేసిన ఆయన డిల్లీలో అడుగుపెట్టాలనుకుంటున్నారు. అందుకే ఇప్పటి నుండే గ్రౌండ్ వర్క్ చేస్తున్నారు. ఇంతకూ ఆ నాయకుడు ఎవరో కాదండి, బిజెపి అంబర్ పేట ఎమ్మెల్యే  జి. కిషన్ రెడ్డి.  

amberpet mla g. kishan reddy future political plans

తెలంగాణ ఉద్యమం ఊపులో అన్ని పార్టీలు కొట్టుకుపోయిన సమయంలో కూడా బిజెపి అధ్యక్షుడిగా కిషన్ రెడ్డి హైదరాబాద్ లో ఐదు స్థానాలను గెలిపించడంతో సపఫలమయ్యారు. అందులో  కిషన్ రెడ్డి కూడా అంబర్ పేట నియోజక వర్గం నుండి ఎమ్మెల్యేగా గెలుపొందారు. అయితే గత కొంత కాలంగా  కిషన్ రెడ్డి 2019 ఎన్నికల్లో లోక్ సభ కు పోటీ చేయాలని భావిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. అయితే మంచి పట్టును సంపాదించుకుని, ఏకంగా మూడు పర్యాయాలు ఎమ్మెల్యేగా గెలిచిన స్థానాన్ని అంత ఈజీగా వదులుకుంటారా అని అనుమానం కలగక మానదు. అయితే అందుకోసమూ ఆయన ఓ ప్లాన్ రచించారని రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతోంది.

అంబర్ పేట్ నియోజక వర్గం నుండి తన భార్య కావ్యకిషన్ రెడ్డి ని భరిలోకి దింపి, తాను సికింద్రాబాద్ లేదా మల్కాజ్ గిరి ఎంపీ స్థానానికి పోటీ చేయాలని కిషన్ రెడ్డి భావిస్తున్నట్లు సమాచారం. అందుకోసమే ఈ మధ్య కాలంలో ఆయన సతీమణి నియోజకవర్గ పరిధిలోని సామాజిక కార్యక్రమాల్లో పాల్గొంటూ ప్రజలకు దగ్గరవుతున్నారని ప్రచారం జరుగుతోంది. 

ఇక ఇన్నేళ్లుగా రాష్ట్ర రాజకీయాల్లో చక్రం తిప్పిన కిషన్ రెడ్డి ఇక కేంద్ర రాజకీయాల్లో తన వంతు పాత్ర పోషించాలని భావిస్తున్నారు. ఇందుకోసమే ఆయన ఎంపీగా లోక్ సభలో అడుగుపెట్టాలని ఉవ్విళ్లూరుతున్నారు. మోదీ చరిష్మా, తన పనితనం రెండింటికి కలగలిపి ఎట్టి పరిస్థితుల్లో ఎంపీగా గెలవాలని స్కెచ్ వేస్తున్నట్లు రాజకీయంగా చర్చ జరుగుతోంది. అదే గనుక జరిగితే తానిప్పుడు ప్రాతినిధ్యం వహిస్తున్న స్థానాన్ని వేరేవారికి వదిలిపెట్టకుండా తన భార్య రాజకీయ రంగ ప్రవేశానికి వాడుకోవాలని కిషన్ రెడ్డి అనుకుంటున్నట్లు అతడి సన్నిహితులు తెలిపారు. 
 
Follow Us:
Download App:
  • android
  • ios