Asianet News TeluguAsianet News Telugu

బాలాపూర్‌ లడ్డూ రికార్డు బద్ధలు.. ఏకంగా రూ. 46 లక్షలు పలికిన ఆల్వాల్ కనాజిగూడ గణేశ్ లడ్డూ

ఆల్వాల్ లోని కనాజిగూడ మరకత గణేశ్ లడ్డూ ఆల్ టైం రికార్డు సృష్టించింది. శనివారం జరిగిన వేలం పాటలో ఇక్కడి లడ్డూ రూ.46 లక్షలు పలికింది. రూ. 45,99,999కి లడ్డూని దక్కించుకున్నారు వెంకట్ రావు అనే వ్యక్తి. 

alwal kanajiguda laddu auctioned for Rs 46 lakh
Author
First Published Sep 10, 2022, 8:58 PM IST

దేశవ్యాప్తంగా గణపతి నిమజ్జన కార్యక్రమం వైభవంగా జరుగుతోంది. హైదరాబాద్‌లో శుక్రవారం నిమజ్జనోత్సవం  జరిగింది. మిగిలిపోయిన గణపతులను ఈరోజు హుస్సేన్ సాగర్‌లో నిమజ్జనం చేస్తున్నారు. ఈ క్రమంలో నగరంలోని పలు ప్రాంతాల్లో లడ్డూ వేలం పాటలు జరుగుతున్నాయి. తాజాగా ఆల్వాల్ లోని కనాజిగూడ మరకత గణేశ్ లడ్డూ ఆల్ టైం రికార్డు సృష్టించింది. శనివారం జరిగిన వేలం పాటలో ఇక్కడి లడ్డూ రూ.46 లక్షలు పలికింది. రూ. 45,99,999కి లడ్డూని దక్కించుకున్నారు వెంకట్ రావు అనే వ్యక్తి. తెలుగు రాష్ట్రాల్లో ఏ ప్రాంతంలోనైనా లడ్డూ వేలం పాటలో ఇదే రికార్డు. 

వినాయక చవితి  వచ్చిందంటే  ఖైరతాబాద్ మహా గణపతి, బాలాపూర్ లడ్డూ వేలం గురించి ప్రధానంగా చెప్పుకోవాల్సిందే. వినాయక నవరాత్రోత్సవాలు ముగిసిన తర్వాత బాలాపూర్ లడ్డూను  వేలం వేస్తారు. ఈ ఏడాది  రూ. 24.60 లక్షలకు వంగేటి లక్ష్మారెడ్డి బాలపూర్ లడ్డూను దక్కించుకున్నారు.   బాలాపూర్ లడ్డూను దక్కించుకొనేందుకు గాను పోటీలు పడి వేలం పాటలో పాల్గొంటారు. ఈ దఫా కూడా వంగేటి లక్ష్మారెడ్డి వేలం పాటలో అధిక పాట పాడి  లడ్డూను దక్కించుకున్నారు. 

ALso Read:వందల నుండి లక్షలకు చేరిన వేలం: బాలాపూర్ లడ్డూ వేలం చరిత్ర ఇదీ

బాలాపూర్ లడ్డా వేలం పాట 1994లో ప్రారంభమైంది. బాలాపూర్ గణేష్ ఉత్సవ సమితి ప్రతి ఏటా వినాయక విగ్రహన్ని ఏర్పాటు చేస్తారు. నవరాత్రోత్సవాలు ముగిసిన తర్వాత  గ్రామ బొడ్రాయి వద్ద  లడ్డూ వేలం పాట నిర్వహిస్తారు.తొలుత వందల్లో ప్రారంభమైన వేలం పాట ప్రస్తుతం లక్షల్లోకి చేరింది. 1994 లో రూ. 450 లకు కొలను కుటుంబ సభ్యులు ఈ లడ్డూను దక్కించుకున్నారు. ప్రతి ఏటా ఈ లడ్డూ వేలం పాటు వందల నుండి వేలు, లక్షలకు చేరుకుంది.  ఈ లడ్డూను దక్కించుకొన్న కుటుంబాలకు అన్ని రకాలుగా మంచి జరుగుతుందనే భావన స్థానికుల్లో ఉంది. దీంతో ఈ లడ్డూ వేలం పాటలో పాల్గొంటారు.

ప్రతి ఏటా తూర్పు గోదావరి జిల్లాలోని తాపేశ్వరం నుండి బాలాపూర్ గణేషుడికి లడ్డూను అందిస్తారు. గత ఏడాది 18 కిలోల లడ్డూను అందించారు. ఈ ఏడాది 20 కిలోలకు పైగా లడ్డూను అందించారు. బాలాపూర్ లడ్డూను వేలం పాటలో కొలను కుటుంబ సభ్యులు 9 దఫాలు దక్కించుకున్నారు. ఈ అడ్డూను అత్యధిక దఫాలు దక్కించుకొంది కూడా కొలను కుటుంబ సభ్యులే. 

Follow Us:
Download App:
  • android
  • ios