Asianet News TeluguAsianet News Telugu

పాతబస్తీలో కాల్పులు.. బల్లికి గురిపెట్టి బాలుడుని కాల్చాడు...

ఎయిర్ పిస్టర్ మిస్ ఫైర్ కావడం వల్లే పాతబస్తీలో చిన్నారికి గాయాలయ్యాయి. ఈ మేరకు పోలీసులు శుక్రవారం వెల్లడించారు. బల్లికి కాల్చబోతే అది గోడకు తగిలి.. పెల్లెట్ బాలుడి వీపుకు తగిలింది. 

air pistol misfires, Pellet  injures to 9-year-old boy in hyderabad
Author
Hyderabad, First Published Aug 6, 2022, 6:44 AM IST

హైదరాబాద్ : Hyderabad మొఘల్ పురాలో వెలుగులోకి వచ్చిన కాల్పుల ఘటనలో మరిన్ని విషయాలు తెలుస్తున్నాయి. తుపాకీ కాల్చాలన్న  సరదాతోనే ఈ ఘటన చోటు చేసుకున్నట్టుగా తెలుస్తోంది. ఆ యువకుడు సోదరుడి ఎయిర్ పిస్టల్ కొనుగోలు చేసి ఇంట్లో సాధన చేస్తున్నాడు. ఈ సాధనే ఓ బాలుడు ప్రాణాలమీదికి తీసుకువచ్చింది. పాతబస్తీలో జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. శుక్రవారం మొగల్పురా సీఐ శివకుమార్ తెలిపిన వివరాల ప్రకారం… సుల్తాన్ షాహీకి చెందిన  మహ్మద్ అబ్దుల్ అఫ్సర్ (30) వాటర్ ప్లాంట్, పాన్ దుకాణం నడుపుతున్నాడు. ఈనెల 1వ తేదీన  మధ్యాహ్నం ఎయిర్ పిస్టల్ (0.177) తో  గోడ మీది బల్లులను కాలుస్తున్నాడు.  

ఈ క్రమంలో ప్రమాదవశాత్తు ఓ బుల్లెట్ గోడకు తగిలి చిన్న ముక్క (పెల్లెట్) వరండాలో ఆడుకుంటున్న పక్కింటి కుర్రాడు (9)  వీపుకు తగిలింది. గాయపడిన బాలుడికి స్థానిక ఆస్పత్రిలో ప్రథమ చికిత్స జరిపించి.. బంజారాహిల్స్లోని కేర్ ఆస్పత్రికి తరలించారు. 3న బహదూర్పురాలోని ప్రైవేట్ ఆస్పత్రికి తీసుకువెళ్లారు. అతను కోలుకుని శుక్రవారం ఇంటికి వెళ్ళాడు. తండ్రి ఫిర్యాదు మేరకు పోలీసులు అఫ్సర్ మీద కేసు నమోదు చేశారు. అఫ్సర్ ఎయిర్ పిస్టల్ తో వస్తువులను కాల్చడం సాధారణంగా మారిందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. చికిత్స చేసిన ఆసుపత్రిలో సైతం పోలీసులకు సమాచారం ఇవ్వకపోవడం గమనార్హం. 

హైదరాబాద్ మొఘల్ పురాలో కాల్పులు: ఎనిమిదేళ్ల బాలుడికి గాయాలు

ఇదిలా ఉండగా, శుక్రవారం మునుగోడులో కాల్పుల కలకలం సృష్టించాయి. టూవీలర్ మీద వెళ్తున్న ఓ యువకుడిని గుర్తుతెలియని దుండగులు మరో బైక్ పై వెంబడించి.. వెనుక  వైపు నుంచి వచ్చి మూడు రౌండ్లు కాల్పులు జరిపారు. ఈ  ఘటన నల్గొండ జిల్లాలో భయాందోళనలు రేపింది. మునుగోడు మండలం సింగారం గ్రామ శివారులో బుధవారం రాత్రి ఇది చోటు చేసుకుంది. ఎస్సై సతీష్ రెడ్డి, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం …నార్కట్పల్లి మండలం బ్రాహ్మణ వెల్లంల గ్రామానికి చెందిన  నిమ్మల లింగస్వామి (32) మునుగోడులో కూల్ డ్రింక్స్, నీళ్ల బాటిళ్ల్స్ వ్యాపార్ం చేస్తుంటాడు. 

దీంతోపాటు రియల్ ఎస్టేట్ చేస్తూ బ్రాహ్మణ వెల్లంపల్లిలో ఉంటున్నాడు. రోజువారీగా దుకాణం మూసేసి టూ వీలర్ పై తిరిగి ఇంటికి వెళుతున్నాడు. ఈ క్రమంలో మునుగోడు మండలం సింగారం శివారు దాటగానే గుర్తు తెలియని దుండగులు ద్విచక్రవాహనంపై వచ్చి రెండు, మూడు రౌండ్లు కాల్పులు జరిపారు. దీంతో లింగస్వామి అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు. అది చూసి లింగస్వామి చనిపోయినట్లు భావించిన దుండగులు అక్కడి నుంచి పరారయ్యారు. అయితే, కాల్పుల శబ్దం విన్న సమీపంలో ఉన్న స్వామి అనే వ్యక్తి.. వెంటనే పోలీసులకు సమాచారం అందించాడు. దీంతో పోలీసులు హుటాహుటిన అక్కడికి చేరుకున్నారు. అప్పటికే లింగస్వామి అపస్మారక స్థితిలోకి వెళ్లడంతో వెంటనే నార్కట్ పల్లి కామినేని ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం అతని పరిస్థితి నిలకడగానే ఉందని సమాచారం. ఘటన జరిగిన స్థలం వద్ద ఓ బుల్లెట్ పడి ఉంది. పోలీసులు నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. నల్గొండ డిఎస్పి నరసింహారెడ్డి కామినేని ఆస్పత్రి వద్దకు వెళ్లి పరిశీలించారు. రియల్ ఎస్టేట్ వ్యాపారితో పాటు మరికొందరిపై అనుమానం ఉందని బాధితులు డీఎస్పీకి చెప్పినట్లు సమాచారం. 

Follow Us:
Download App:
  • android
  • ios