రానున్న ఎన్నిక‌ల్లో గెలుపే ల‌క్ష్యం.. ఈ నెల 9న తెలంగాణ బీజేపీ ప్ర‌త్యేక స‌మావేశం

Hyderabad: పార్టీ బలోపేతానికి ఈ నెల 9న భార‌తీయ జ‌న‌తా పార్టీ ప్ర‌త్యేక స‌మావేశం నిర్వ‌హించ‌నుంద‌ని ఆ పార్టీ వ‌ర్గాలు తెలిపాయి. తెలంగాణలో ఈ ఏడాది చివర్లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలపై కూడా ఈ సమావేశంలో ప్రధానంగా చర్చించనున్నట్లు  స‌మాచారం. 
 

Aiming to win the upcoming elections: BJP to hold meeting on July 9 to strengthen party RMA

Telangana BJP: పార్టీ బలోపేతానికి ఈ నెల 9న భార‌తీయ జ‌న‌తా పార్టీ ప్ర‌త్యేక స‌మావేశం నిర్వ‌హించ‌నుంద‌ని ఆ పార్టీ వ‌ర్గాలు తెలిపాయి. తెలంగాణలో ఈ ఏడాది చివర్లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలపై కూడా ఈ సమావేశంలో ప్రధానంగా చర్చించనున్నట్లు  స‌మాచారం. రాష్ట్ర బీజేపీ అధ్య‌క్షుడు జీ.కిష‌న్ రెడ్డి స‌హా కీల‌క నేత‌లంద‌రూ హాజ‌రుకానున్నార‌ని సంబంధిత వ‌ర్గాలు పేర్కొన్నాయి.

వివ‌రాల్లోకెళ్తే. 2024 లోక్‌సభ ఎన్నికలు, రాష్ట్ర అసెంబ్లీ ఎన్నిక‌లకు పార్టీ సన్నద్ధత తదితర అంశాలపై చర్చించేందుకు దక్షిణాది రాష్ట్రాలకు చెందిన పార్టీ ముఖ్య నేతలతో జులై 9న హైదరాబాద్‌లో సమావేశం కానున్నట్టు బీజేపీ నేత, కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి తెలిపారు. దక్షిణాది రాష్ట్రాల్లో పార్టీ బలోపేతానికి కార్యాచరణ ప్రణాళికపై రోజంతా జరిగే సమావేశంలో చర్చిస్తామని తెలంగాణ బీజేపీ అధ్యక్షుడిగా కొత్తగా నియమితులైన జీ.కిష‌న్ రెడ్డి ఢిల్లీలో విలేకరులతో అన్నారు.

తెలంగాణలో ఈ ఏడాది చివర్లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలపై కూడా ఈ సమావేశంలో ప్రధానంగా చర్చించనున్నట్లు ఆయన తెలిపారు. హైదరాబాద్‌లోని బీజేపీ తెలంగాణ ప్రధాన కార్యాలయంలో జరిగే సమావేశానికి బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, బీజేపీ ప్రధాన కార్యదర్శి బిఎల్ సంతోష్, ఇతర సీనియర్ నాయకులు హాజరయ్యే అవకాశం ఉందని కేంద్ర పర్యాటక శాఖ మంత్రి తెలిపారు.

ఇదిలావుండ‌గా, తెలంగాణ బీజేపీ అధ్యక్షుడిగా నియమితులైన మరుసటి రోజే ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షతన బుధవారం జరిగిన కేబినెట్ సమావేశానికి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గైర్హాజరయ్యారు. ఆయన గైర్హాజరు కావడానికి అధికారిక కారణం ఏదీ చెప్పనప్పటికీ, కేంద్ర మంత్రివర్గం ఊహించిన పునర్వ్యవస్థీకరణకు ముందే ఆయన నిష్క్రమించే అవకాశం ఉందని కొందరు నేతలు భావిస్తున్నారు. ఈశాన్య ప్రాంత సాంస్కృతిక, పర్యాటక, అభివృద్ధి శాఖల మంత్రి రెడ్డి మంగళవారం బీజేపీ తెలంగాణ శాఖ అధ్యక్షుడిగా నియమితులయ్యారు.

ప్రధాని మోడీ త్వరలో తన మంత్రి మండలిని పునర్వ్యవస్థీకరించాలని భావిస్తున్నారు. 2024లో లోక్‌సభ ఎన్నికలతో పాటు ఈ ఏడాది అనేక రాష్ట్రాల ఎన్నికలకు అధికార పార్టీ సిద్ధమవుతున్నందున, బీజేపీలో సంస్థాగత మార్పులు దానికి ముందస్తుగా భావించబడుతున్నాయి. విస్తృతంగా ఊహాగానాలు జరుగుతున్న కేంద్ర మంత్రి మండలి పునర్వ్యవస్థీకరణపై పార్టీ లేదా ప్రభుత్వం నుంచి అధికారికంగా ఎలాంటి ప్ర‌క‌ట‌న రాలేదు.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios