Asianet News TeluguAsianet News Telugu

హేమంత్ హత్యకు మరో ముఠాతోనూ ఒప్పందం: ఫోన్ ఆపేయడంతో....

తన అక్క కూతురు అవంతిని ప్రేమ వివాహం చేసుకున్న హేమంత్ ను హత్య చేయడానికి యుగంధర్ రెడ్డి మరో ముఠాతోనూ ఒప్పందం చేసుకున్నట్లు తెలుస్తోంది. అయితే, ఆ ముఠా అతనికి అందుబాటులో లేకుండా పోయింది.

Agreement made with another gang too to kill Hemanth KPR
Author
Hyderabad, First Published Sep 29, 2020, 9:15 AM IST

హైదరాబాద్: తీవ్ర సంచలనం సృష్టించిన హేమంత్ హత్య కేసులో పలు కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. అవంతి ఇంటి నుంచి పారిపోయి హేమంత్ ను గుడిలో వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. హేమంత్ ను అవంతి కుటుంబ సభ్యులు హత్య చేయించారు. అయితే, ఈ వ్యవహారంలో కొత్త విషయాలు ముందుకు వచ్చాయి. 

ఈ ఏడాది జూన్ 10వ తేదీన అవంతి, హేమంత్ వివాహం చేసుకున్నారు. తమ వైపు అవంతిని తిప్పుకునేందుకు కుటుంబ సభ్యులు తీవ్ర ప్రయత్నాలు సాగించారు అయితే, ఆ ప్రయత్నాలు ఫలించలేదు. హేమంత్ ను కిడ్నాప్ చేసి బెదిరిచి వారిద్దరినీ విడదీయాలని అనుకున్నారు ఇందుకు ఒకటి రెండు నెలల క్రితమే యుగంధర్ రెడ్డి ఓ ముఠా సభ్యుడిని సంప్రదించాడు. 

Also Read: ఆరు నెలలు 24 గంటలు నిఘా: అవంతి హేమంత్ తో పారిపోయిన వైనం ఇదీ...

అతనితో రూ. 10 లక్షలకు ఒప్పందం కూడా చేసుకున్నాడు. లక్ష రూపాయలు ముందస్తుగా చెల్లించాడు. పరిస్థితులు సానుకూలంగా ఉన్నప్పుడు సమాచారం అందిస్తే కిడ్నాప్ చేస్తామంటూ ఆ వ్యక్తి చెప్పాడు. రెండు మూడు సార్లు రెక్కీ కూడా నిర్వహించి సమాచారం అందించినా ఇప్పుడు వద్దంటూ ఆ ముఠా సభ్యుడు తప్పించుకుంటూ వచ్చాడు. ఆ తర్వాత ఆ ముఠా సభ్యుడు ఫోన్ స్విచాఫ్ చేశాడు. ఆ తర్వాత బిచ్చూ యాదవ్ ముఠాతో ఒప్పందం చేసుకుని హేమంత్ ను హత్య చేయించాడు.

Also Read: హేమంత్ హత్య కేసులో ట్విస్ట్: అవంతి ఆరోపణ... తెరపైకి మరో ఇద్దరి పేర్లు

హేమంత్ హత్య కేసులో పోలీసులు 25 మంది నిందితులను గుర్తించారు. సుపారీ గ్యాంగ్ తో హేమంత్ ను హత్య చేయించినట్లు అవంతి తండ్రి లక్ష్మారెడ్డి, మేనమామ యుగంధర్ రెడ్డి అంగీకరించారు. 

Follow Us:
Download App:
  • android
  • ios