వివాదాస్పద పుస్తక రచయిత కంచ ఐలయ్యపై పోరాటానికి తాజాగా అఘోరాలు రంగంలోకి దిగుతున్నారు. కంచ ఐలయ్య రాసిన పుస్తకం యావత్ హిందూ ధర్మాన్ని కాలరాసేవిధంగా ఉందని అఘోరాలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

సాధారణంగా అఘోరాలు బయటకు రారని, కానీ ఐలయ్య రాతలు చూసిన తర్వాత తాము బయటకు రాక తప్పదని అఘోరీ సంస్థాన్ ప్రతినిధి హెచ్చరించారు. కులాల గురించి మతాల గురించి ఐలయ్య మాట్లాడడమేంటని ప్రశ్నించారు.

ఏం ఉత్పత్తి చేస్తున్నారని ఐలయ్య ప్రశ్నించడం సరికాదన్నారు. ధర్మాన్ని ఉత్పత్తి చేస్తున్న విషయాన్ని ఐలయ్య గుర్తుంచుకోవాలన్నారు. ప్రభుత్వాలు ఐలయ్య విషయంలో ఏమాత్రం ఉపేక్షించకుండా తక్షణమే చర్యలు తీసుకుని శిక్షించాలని అఘోరీ సంస్థానం ప్రతినిధి డిమాండ్ చేశారు.

అఘోరీలు అంటేనే శవాలను పీక్కుతింటారు, బయకు రారు అన్న భయం జనాల్లో ఉంది… కానీ ఇప్పుడు మేము బయటకొచ్చాక ఐలయ్య వ్యాఖ్యలు చూసి మేమే భయపడే పరిస్థితి వచ్చిందని అఘోరా నాయకుడు ఆందోళన వ్యక్తం చేశారు.

సమాజాన్ని పీక్కు తినే వ్యక్తులు మేథావుల రూపంలో, ప్రొఫెసర్ల రూపంలో సమాజంలో తిరుగుతున్నారని అర్థమైందన్నారు. కులాలు రూపుమాపుతానని చెప్పే వ్యక్తి ఒక కులాన్ని కింపపరిచేలా మాట్లాడడం తగదన్నారు. హిందూ సమాజాన్ని కించపరిచేలా మాట్లాడడం ఐలయ్యకు తగదు.  

పరిపూర్ణానంద స్వామిని, కోమట్లను కించపరిచేలా మాట్లాడినందుకు కాదు హిందూ సమాజాన్ని తిడుతున్నందుకు మేము స్పందించాల్సివస్తున్నదని అఘోరీ నేత స్పష్టం చేశారు.

 

మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి