కమ్యూనిస్టులు గాంధీ భవన్‌కు రావడం మళ్లీ ఇప్పుడే.. : కాంగ్రెస్‌కు తన సారథ్యంపై రేవంత్ రెడ్డి
రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. తాను పీసీసీ బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి కాంగ్రెస్ పార్టీకి ప్రాధాన్యత పెరిగిందని వివరించారు. గతంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో కమ్యూనిస్టులు గాంధీ భవన్‌కు వచ్చి చర్చించేవారని, ఇప్పుడు మళ్లీ తన హయాంలోనే కమ్యూనిస్టులు గాంధీ భవన్ వచ్చి చర్చిస్తున్నారని తెలిపారు.
హైదరాబాద్: టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. తాను తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి పార్టీకి ప్రాధాన్యత పెరిగిందని వివరించారు. ఇప్పుడు నాయకులకు కాకుండా పార్టీకి ప్రాధాన్యత ఉన్నదని తెలిపారు. ఎంతో మంది జాతీయ నేతలు తెలంగాణకు వస్తున్నారని చెప్పారు. అంతకు ముందు కాంగ్రెస్ నేతలు ఇతర పార్టీల్లోకి వెళ్లేవారని అన్నారు. కానీ, ఇప్పుడు వేరే పార్టీల నుంచి కాంగ్రెస్ పార్టీలోకి నేతలు వస్తున్నారని వివరించారు. ఇప్పుడు కమ్యూనిస్టు కూడా గాంధీ భవన్‌కు వచ్చి మాట్లాడుతున్నారని చెప్పారు.
గతంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో కమ్యూనిస్టులు గాంధీ భవన్‌కు వచ్చేవారని, గాంధీ భవన్‌లో చర్చలు జరిపేవారని రేవంత్ రెడ్డి అన్నారు. ఆ తర్వాత మళ్లీ ఇప్పుడు తన హయాంలోనే కమ్యూనిస్టులు గాంధీ భవన్‌కు వస్తున్నారని తెలిపారు. పార్టీ అధిష్టానం కూడా తెలంగాణపై ఎక్కువ ఫోకస్ పెట్టిందని వివరించారు. ఇందుకు తార్కాణంగా సీడబ్ల్యూసీ సమావేశాలను ఆయన ఉటంకించారు.
Also Read: మోడీ ప్రభుత్వాన్ని మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ ప్రశంసించిన వేళా..
మరెన్నో రాష్ట్రాల్లో ఎన్నికలు సమీపించినా.. కాంగ్రెస్ పార్టీ జాతీయ నాయకత్వం కొత్త సీడబ్ల్యూసీ తొలి సమావేశాలకు తెలంగాణను ఎంచుకుందని రేవంత్ రెడ్డి తెలిపారు. జాతీయ నాయకత్వం తెలంగాణ రాష్ట్రానికి ఎంతటి ప్రాధాన్యత ఇస్తున్నదో ఈ నిర్ణయాలను గమనిస్తే అర్థం అవుతుందని చెప్పారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ వేగంగా దూసుకుపోతున్నదని వివరించారు. ఈ రెండేళ్లలో అధికార బీఆర్ఎస్ పార్టీ కూడా నిర్వహించనన్ని సభలను కాంగ్రెస్ పార్టీ నిర్వహించిందని తెలిపారు.