హైదరాబాద్:అధికార పార్టీలో మున్సిపల్ ఎన్నికల పుణ్యమా అంటూ ఆధిపత్య పోరుకు తెర పడుతోంది. సీనియర్లు సిట్టింగ్ ఎమ్మెల్యేల మధ్య చాలా నియోజకవర్గాల్లో ఆధిపత్య పోరు కొనసాగుతోంది. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల మధ్య కూడా దాదాపు అదే  పరిస్థితి ఉంది.

also read:మున్సిపల్ పోల్స్: టీఆర్ఎస్ తలనొప్పి, రెబెల్స్ బెడద

 మున్సిపల్ ఎన్నికలు రావడంతో  కీలక నేతల అనుచరులు పోటీ చేసేందుకు తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నారు ఎమ్మెల్యేలకే పూర్తి బాధ్యతలు అప్పగించడంతో ఎమ్మెల్యేలు తమ వర్గానికి పెద్దపీట వేస్తున్నారు. దీంతో సీనియర్ నేతలు తమ వర్గానికి టికెట్లు సాధించుకునేందుకు పార్టీ హైకమాండ్ దగ్గర ప్రయత్నాలు మొదలు పెట్టారు.

 సీనియర్ నేతలు, గెలిచిన పార్టీ ఎమ్మెల్యేల మధ్య హైకమాండ్ సయోధ్యకు ప్రయత్నాలు మొదలు పెట్టింది. టికెట్ల కేటాయింపు ముందుగానే  ఇద్దరు నేతలను పిలిచి మాట్లడుతూ సమస్యల పరిష్కారం పై దృష్టి పెట్టి  పార్టీ విజయవంతం అయింది. 

పార్టీ సీనియర్ల నేతలను ఆధిపత్య పోరు ఉన్న నియోజకవర్గ ఇన్చార్జీలు గా నియమించి చర్చలు జరిపుతోంది. సీనియర్ నేతల వర్గానికి కొన్ని టిక్కెట్లు కేటాయించే ఒప్పందం కుదుర్చుకుంటుంది.

 ఉమ్మడి రంగారెడ్డి జిల్లా తాండూరులో ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి, ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి వర్గాల మధ్య మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్  ఇరు వర్గాలకు న్యాయం జరుగుతుందని హామీ ఇవ్వడంతో ఎన్నికల్లో కలిసి పనిచేయాలని ఇద్దరు నేతలు వచ్చారు.


అదేవిధంగా కొల్లాపూర్,షాద్ నగర్, పాలేరు,కోదాడ లాంటి నియోజకవర్గాల్లో  ఎమ్మెల్యేలు తమ సీనియర్ నేతల అనుచరులకు టికెట్ ఇవ్వాలనే ప్రతిపాదనకు ఆమోదం తెలపడంతో  ఆయా నియోజకవర్గాల్లో ఉన్న ఆధిపత్య పోరు తాత్కాలికంగానైనా తెరపడినట్లయింది.