దిశ సంఘటనతో డయిల్ 100కు ప్రాధన్యం పెరిగింది. కామాంధుల చేతుల్లో అత్యంత పాశవికంగా అత్యాచారినికి, హత్యకు గురైన  డాక్టర్ దిశ కేస ఉదంతం పోలీసు వ్యవస్థలో విప్లవాత్మక మార్పులను తీసుకొచ్చింది. నలుగురు నిందితులను ఎన్ కౌంటర్ చేసిన అనంతరం తెలంగాణ ప్రజలు  పోలీసులపై నమ్మకం పెరిగినట్లు కనిపిస్తోంది.  బాధితుల అభ్యర్ధనను వెంటనే స్పందిస్తున్నారు పోలీసులు. 

ఎలాంటి ఆపదలో ఉన్న 100కు ఫోన్ చేసి పోలీసులను ఆశ్రయిస్తున్నారు ప్రజలు. వారికి పోలీసులు భరోసగా నిలుస్తున్నారు. అందుకు తాజాగా జరిగిన  ఓ సంఘటనే ఉదాహరణగా నిలుస్తోంది.  హైదరాబాద్ సమీపంలోని ఔటర్ రింగ్ రోడ్డు వద్ద అర్ధరాత్రి ఈ  ఘటన చోటుచేసుకుంది.నల్లగొండ జిల్లా హాలియాకు చెందిన శ్రీనివాస్‌, భవాని దంపతులు తమ కారులో శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయానికి వెళుతున్నారు. 

ఇక కాల్చి పారేయడమే: రేపిస్టుసులకు తలసాని హెచ్చరిక

తెల్లవారు జామున 4 గంటల సమయంలో విమానాన్ని ఎక్కాల్సి ఉంది. అయితే ఆకస్మికంగా ప్రయాణిస్తున్న కారు టైర్ పంక్చర్ అయింది.అప్పుడు సమయం అర్ధరాత్రి 2 గంటలు అవుతుడడంతో  ప్రత్యామ్నాయ మార్గాలేవీ లేక వెంటనే వారు డయల్ 100కు ఫోన్ చేశారు. అనంతరం వారి పరిస్ధితిని పోలీసులకు వివరించారు. దీంతో వెంటనే స్పందించిన  ఆదిభట్ల పోలీసులు మెకానిక్‌ను తీసుకుని సంఘటనా స్థలానికి చేరుకున్నారు. 

నిత్యానంద, శ్రీనివాస్ రెడ్డిల సంగతేంటి: దిశ నిందితుల ఎన్ కౌంటర్ పై జగ్గారెడ్డి

అనంతరం మెకానిక్ తో టైరును  పంక్చర్ చేయించారు. ఆపదలో వారికి పోలీసులు సహయం అందించిన వార్త సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అలాగే పోలీసులు స్సందించిన తీరుపై శ్రీనివాస్ దంపతులు హర్షం వ్యక్తం చేశారు. సహయం కోసం అభ్యర్ధిస్తున్న తమను అందుకున్నందకు వారికి ధన్యవాదాలు తెలిపారు.