తెలుగు రాష్ట్రాల్లో సంచలన సృష్టించిన ఈఎస్ఐ కుంభకోణంలో మరిన్ని పేర్లు బయటకొస్తున్నాయి. తెలంగాణ కార్మికశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శశాంక్ గోయల్ మెడకు ఈ స్కాం చుట్టుకుంది.

ఆయన ప్రొద్బలంతోనే ఈఎస్ఐ డైరెక్టర్ దేవికారాణి అక్రమాలకు పాల్పడ్డారంటూ ఫిర్యాదుదారు ఏసీబీకి ఫిర్యాదు చేయడంతో శశాంక్‌తో మరికొందరు అధికారుల పాత్రపై అధికారులు ఆరా తీస్తున్నారు.  

ఈఎస్ఐ కుంభకోణంలో మొత్తం ఎనిమిది మందిని ఏసీబీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. ఉస్మానియా ఆసుపత్రిలో వైద్యపరీక్షల అనంతరం వారిని ఏసీబీ కోర్టులో హాజరుపరిచారు.

ఈఎస్ఐలోని ఐఎమ్ఎస్ విభాగంలో మందుల కొనుగోళ్లలో దేవికారాణి నిబంధనలు పక్కనబెట్టి కోట్ల రూపాయల అవినీతికి పాల్పడినట్లు ఏసీబీ దర్యాప్తులో తేలింది.

నకిలీ బిల్లులు సృష్టించి, అవసరం లేకున్నా మందులు కొనుగోలు చేసి సుమారు రూ.300 కోట్ల కుంభకోణానికి పాల్పడ్డారని అవినీతి నిరోధక శాఖకు ఫిర్యాదు అందాయి. 

సంబంధిత వార్తలు:

వైద్య పరీక్షల కోసం దేవికా రాణితో పాటు ఏడుగురు ఉస్మానియాకు తరలింపు

ఈఎస్ఐ డైరెక్టర్ దేవికా రాణి అరెస్ట్ (వీడియో)

ఈఎస్ఐ మందుల స్కాం... దేవికా రాణి అరెస్ట్

అవసరం లేకపోయినా మందుల కొనుగోళ్లు: టీఎస్ ఈఎస్ఐలో రూ.300 కోట్ల స్కాం