2016 సంవత్సరంలో ఏడేళ్ల బాలుడిపై ఓ యువకుడు లైంగిక దాడికి ఒడిగట్టాడు. ఈ ఘటన హైదరాబాద్ లోని చంద్రయాణగుట్ట పరిధిలో చోటు చేసుకుంది. తాజాగా ఈ కేసులో కోర్టు తీర్పు వెలువరించింది.
హైదరాబాద్ లోని చంద్రయాణగుట్టలో 2016 సంవత్సరంలో ఓ బాలుడిపై లైంగిక దాడికి పాల్పడిన యువకుడికి కోర్టు శిక్ష విధించింది. అతడికి 20 ఏళ్ల జైలు శిక్షతో పాటు, రూ.8 వేల ఫైన్ కూడా వేసింది. ఈ మేరకు కోర్టు శుక్రవారం తీర్పు వెలువరించింది.
బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్యకు షాక్.. ఆరిజన్ నిర్వాహకురాలు శేజల్ తో బీఆర్ఎస్ ఎంపీల చర్చలు..
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. చంద్రాయణగుట్ట పరిధిలోని పూలాబాగ్ లో 21 ఏళ్ల షేక్ ఇస్మాయిల్ నివసించేవాడు. అతడు తన పక్కింట్లో నివసించే ఏడేళ్ల బాలుడిపై 2016 ఏప్రిల్ 16వ తేదీన లైంగిక దాడికి ఒడిగట్టాడు. ఈ ఘటనపై బాలుడి తండ్రి పోలీసులను ఆశ్రయించాడు. నిందితుడిపై ఫిర్యాదు చేశాడు.
ఘోరం.. 11 నెలల చిన్నారిపై బాలుడు అత్యాచారం.. రక్తపు మడుగులో వదిలేసి పారిపోయిన మైనర్..
బాలుడి తండ్రి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. అనంతరం కేసు దర్యాప్తు మొదలుపెట్టి.. కోర్టులో ఛార్జిషీట్ సమర్పించారు. ఈ కేసులో అప్పటి నుంచి కోర్టులో విచారణ సాగింది. తాజాగా నిందితుడిని కోర్టు దోషిగా తేల్చింది. అతడికి 20 ఏళ్ల పాటు కఠిన కారాగార జైలు శిక్ష విధించింది. అలాగే రూ.8 వేల ఫైన్ విధిస్తూ సెషన్స్ జడ్జి టి.అనిత తీర్పు చెప్పారు.
