నిజామాబాద్ లో ఓ హృదయ విదారకర ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఓ తండ్రి రోడ్డు ప్రమాదంలో చనిపోతే, అతడితో పాటు ఉన్న మూడేళ్ల కుమారుడికి ఈ విషయం తెలియక రాత్రంతా లేపేందుకు ప్రయత్నించాడు. ఒంటరిగా కూర్చొని రోదిస్తూ, నిద్రపోయాడు.
ఆ బాలుడికి మూడు సంవత్సరాలు. తండ్రితో కలిసి వేరే గ్రామానికి బైక్ పై వెళ్లాడు. రాత్రి సమయంలో తిరిగి వస్తుండగా అటవీ ప్రాంతంలో రోడ్డు ప్రమాదం జరిగింది. దీంతో తండ్రి అక్కడికక్కడే మరణించాడు. కానీ ఈ విషయం ఆ పసి వయస్సుకు అర్థం కాలేదు. రాత్రంతా ఏడుస్తూ, తండ్రి లేపేందుకు ఒంటరిగా ప్రయత్నిస్తూనే ఉన్నాడు. ఆ సమయంలో ఆ దారి గుండా ఎవరూ వెళ్లకపోవడంతో వీరినెవరూ గమనించలేదు. అయితే ఆ ప్రాంతంలో ఉన్న దేవాలయానికి వచ్చిన పూజరి వారిని గమనించి పోలీసులకు సమాచారం అందించాడు.
ఈ హృదయ విదారకర ఘటన నిజామాబాద్ జిల్లాలో జరగ్గా.. స్థానిక ఎమ్మెల్యే పరామర్శతో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివరాలు ఇలా ఉన్నాయి. నిజామాబాద్ జిల్లా ఇందల్ వాయి మండలం వెంగల్ పాడ్ గ్రామానికి చెందిన 34 ఏళ్ల మాలవత్ రెడ్డి తన 3 సంవత్సరాల కుమారుడు నితిన్ తో కలిసి గత నెల 21వ తేదీన కామారెడ్డికి వెళ్లాడు. అక్కడి యాచారంలోని చుట్టాల ఇంటికి ఉదయం బైక్ పై బయలుదేరాడు. అనంతరం అదే రోజు రాత్రి సమయంలో బైక్ పై తిరిగి వస్తున్నాడు.
‘‘యూనిఫాం సివిల్ కోడ్ అమలుకు బీఎస్పీ వ్యతిరేకం కాదు.. కానీ..’’- మాయావతి
వీరి వాహనం సదాశివనగర్ మండలంలోని దుగ్గి అడవి ప్రాంతంలోకి చేరుకునే సరికి ఓ బారికేడ్ ను ఢీకొట్టింది. దీంతో వీరిద్దరూ కింద పడిపోయారు. అయితే మాలవత్ రెడ్డికి తలకు తీవ్ర గాయాలు అయ్యాయి. దీంతో ఆయన అక్కడికక్కడే మరణించాడు. కానీ కుమారుడికి ఈ విషయం తెలియదు. తండ్రికి ఏమైందో కూడా అర్థంకాని పసి వయస్సు ఆ పిల్లాడిది. రాత్రి అంతా తన తండ్రి లేపేందుకు ప్రయత్నిస్తూనే ఉన్నాడు. తీవ్రంగా రోదించి అక్కడే పడుకున్నాడు.
పెళ్లి వేడుకల్లో అత్త సిగరెట్ తాగుతూ, డ్యాన్స్ చేసిందని వివాహాన్ని రద్దు చేసిన వరుడు.. ఎక్కడంటే ?
అయితే మరుసటి రోజు పొద్దున అక్కడ ఉన్న గుడికి ఓ పూజరి వచ్చాడు. జరిగిన విషయం అర్థం చేసుకొని వెంటనే పోలీసులకు సమాచారం అందించాడు. సదాశివనగర్ పోలీసులు అక్కడికి చేరుకున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్నారు. అయితే బాధిత కుటుంబాన్ని ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్థన్ ఆదివారం పరామర్శించారు. బాధిత కుటుంబానికి అండగా ఉంటామని, ఆర్థిక సాయం అందిస్తామని తెలిపారు.
