Asianet News TeluguAsianet News Telugu

తెలంగాణ నిరుద్యోగి నిరసన కవిత

  • తెలంగాణ సర్కారు తీరుపై నిరుద్యోగుల ఆగ్రహం
  • కవిత రాసిన నిరుద్యోగి
  • నియామకాల జాడ లేదని ఆవేదన
a poem on the telangana god that failed

( తెలంగాణ రాష్ట్రం వచ్చి మూడేళ్ళకు పైగా గడుస్తున్నా ఉద్యోగ కల్పన పై దృష్టి సారించని తెరాస ప్రభుత్వం పై నిరసన గా ఈ కవిత్వం )

*   హెచ్చరిక  ( కవిత ) *

 

గులాబీలు శాసిస్తున్న ఈ విష సంస్కృతిలో

రాజకీయాలు సృష్టిస్తున్న విషప్రసారమాధ్యమాలలో 

అందని ద్రాక్ష గా వున్నా ఉద్యోగ కల్పనలో

ఎవరినీ నిలదీయాలో తెలియక 

భవిష్యత్ కానరాక విద్యార్థులు 

మౌనం గా నిల్చున్నారు

 

ఉమ్మడి రాష్ట్రం లో అధికారం గా అడిగినవి

స్వరాష్ట్రీయుల పాలన లో ఆర్ధించేస్థాయికీ దిగజారం  

 

గందరగోళ నోటిఫికేషన్లు మధ్య 

అస్తవ్యస్తమైన చదువులు

ఎప్పుడో రావాల్సిన ఉద్యోగాలకై విద్యార్థులు

ఇంకైంత కాలం తపస్సు చేయాల్సివుందో 

ఉద్యోగమునకు అర్హులమేననీ నిరూపించుటకు

నెలకొక ప్రవేశ పరీక్ష రాస్తూనే వుంటారు విద్యార్థులు

తీరా....

అన్నీ అగ్నిపరీక్షలనుంచి బయటపడ్డగానే

కోర్ట్ కేస్సంటూ విద్యార్థి కీ తపోభంగం అవుతూనే వుంటుంది

ఉత్సాహం అనే మాట ఎన్నిసార్లు జావగారినదో 

లక్ష్యం దగ్గరగా గురిపెట్టిన శస్త్రము ను 

ఎన్ని సార్లు విరమించాల్సివచ్చిందో 😓

 

మాట మాటాకీ....

ఈ ప్రభుత్వాలు ప్రాజెక్టులకు అడ్డుతగులున్నారనీ

పతాక శీర్షికలేక్కుతారు

నోరు తెరిస్తే స్వీయ వైఫల్యాలకు పక్క రాష్ట్రీయులను బలిచేస్తారు

బంగారు తెలంగాణ అనీ పూటకో భ్రమలు కల్పిస్తూ

అరచేతిలో స్వర్గం చూపిస్తారు

మూడేళ్ళు గడుస్తున్నా నియామాకాలేవంటే

రోజుకో సాకుతో మన్ను తిన్న పామోలే కాలం వెళ్లదీస్తారు

 

నోరు మెదపలేనీ ప్రతిపక్షాలు

నీతిలేని స్వరాష్ట్ర పత్రికలు

పొగరుబట్టీ స్వంత డబ్బా కొట్టుకుంటూ

వెటకారాల వార్తలను ప్రసారం చేసే టీవీచానల్స్

నిజాలు నిస్సిగ్గుగా దాచే ప్రసార మధ్యమాలు

ఇక విద్యార్థులు చేసిన బలిదానాలకు విలువేముంది

 

ఉద్యోగాలు సరే.....

అస్సలు నోటిఫికేషన్ వుందో

రద్దయిందో కూడా తెలియని అయోమయం

నాణ్యతలేని ప్రశ్నపత్రాలకు సరియగు సమాధానాలు ఇవ్వలేని దుస్థితి

ప్రభుత్వ తీరుపై కమ్ముకున్న నీలినీడలు

సరైన నిర్వహణ చేతకాక ఎన్నిసార్లు

అభాసుపాలైన రాజీకీ రాని  సిగ్గులేని సర్వీస్ కమీషన్

ఇన్ని పరిస్థితుల మధ్య

ఎన్ని అవాంతరాలు వున్నా ఉద్యోగాలు సృష్టించిన ఆంధ్రపాలన యే నయమనిపంచే పరిస్థితీ

అయినా సరే.....

విమర్శల జడివానకు చలించని ప్రభుత్వం

మొండికేత్తిన మహిషాన్ని తలపిస్తుందీ

 

విద్యార్దులు అల్లుకున్న స్వప్నాలు

పేలికలుగా చీలిపోతున్నవి

ఉద్యోగంకై పెట్టుకున్న ఆశలు

అసహనంతో ఊగిపోతున్నాయి

రాష్ట్ర సాధన ఉదేశ్యంకై అమరులైనవారి

త్యాగాలు గాలిలో దూదిలై తేలిపోతున్నవి

ఇకనైన ....

మనం  అసహనం ప్రదర్శించకపోతే

ప్రభుత్వ వైఖరి మార్చలేము

 

అదిగో చూడండీ ...

ఆ గులాబీలా దళంవారు వచ్చేస్తున్నారు

అధికార దాహంతో సామ్రాజ్య విస్తరణకై

పార్టీ సభ్యత్వ నమోదు  గావిస్తున్నారు 

మనం కన్న బంగారు తెలంగాణ

కలల వనాలను నాశనం చేసీ

గులాబీల పూలతోటలను పూయిస్తున్నారు

 

ఎవరి కలలు నాశనం అయితేనేం

మీరు గులాబీ జెండాలను ఎత్తండీ

ఎవరి ఆశలు ఆశయాలు ఆవిరులయితేనేం

మీరూ కారుకు జై జైలు కొట్టండి

ఎవరు ఎటూ చస్తే మీకేం

మీకు కావాలిసిన వాటికోసం

గులాబీ భజన సంఘాలు ఏర్పరచండీ

మీ నిరంకుశత్వాన్ని నిరసించి తిరుగుబాటు చేయకుండా

మరో రజాకార్ల గులాబీదళం ఏర్పరచండి

ఇదేమీటనీ అడిగినా ప్రతివాడినీ

తరిమి తరిమి కొట్టండీ

విభీషణుడీ లా ఎదురునిలిచిన

ప్రతివాడికీ వెన్నుపోటుదారుడనీ

ఆంధ్రతోత్తులనీ బిరుదులివ్వండీ

అప్పుడూ గానీ మిమ్మలీనీ నమ్మి గెలిపించిన మాకూ బుద్ది రాదు

 

పార్టీకైనా జీవితానీకైనా

పుట్టక వికాసం వృద్ధి వున్నట్లే

పతనం కూడా తప్పక వుండివుంటుంది

హెచ్చరిక...

విద్యార్థులకు సంతృప్తినివ్వనీ ప్రభుత్వాలకు 

చరిత్రలో లేవు ఆనవాళ్ళు....

      

                   * ఐ.చిదానందం *

Follow Us:
Download App:
  • android
  • ios