Asianet News TeluguAsianet News Telugu

కూకట్ పల్లిలో ఘోరం.. సగం కాలిపోయిన స్థితిలో మృతదేహం లభ్యం.. క్షుద్రపూజలు జరిగాయని స్థానికుల అనుమానం..

హైదరాబాద్ లోని కేపీహెచ్ బీ కాలనీ సమీపంలో ఉన్న ఓ శ్మశాన వాటికలో సగం కాలిన డెడ్ బాడీ కనిపించింది. స్థానికులు సమాచారం అందించడంతో పోలీసులు అక్కడికి చేరుకున్నారు. కేసు దర్యాప్తు ప్రారంభించారు. 

A half-burnt body was found in Kukat Palli.. Locals suspect that occult worship took place..
Author
First Published Oct 26, 2022, 3:03 PM IST

కూకట్ పల్లిలో ఘోరం వెలుగులోకి వచ్చింది. కేపీహెచ్ బీ కాలనీ సమీపంలో ఉన్న ఓ శ్మశాన వాటికలో సగం కాలిపోయిన స్థితిలో ఓ మృతదేహం కనిపించింది. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. ఇందులో క్షుద్రపూజలు ప్రమేయం ఉందేమోనని స్థానికులు అనుమానాలు వ్యక్తం చేశారు. గుర్తు తెలియని వ్యక్తిని చంపేసి, మృతదేహానికి నిప్పంటించారని భావిస్తున్నారు. మృతదేహం ఎవరిదనేది గుర్తుపట్టలేకుండా ఉంది. ఈ ఘటన కేపీహెచ్ బీ పోలీసు స్టేషన్ పరిధిలో జరిగింది.

మంచిర్యాలలో బెజ్జంకి ఎస్ఐ వీరంగం: కేసు నమోదు

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. హైదర్ నగర్ లోని అలీతలాబ్ సమీపంలో ఉన్న హిందూ శ్మశాన వాటికలో సగం కాలిన డెడ్ బాడీని గుర్తించామని పలువురు స్థానికులు సోమవారం ఉదయం పోలీసులకు కాల్ చేసి చెప్పారు. దీంతో వెంటనే పోలీసులు అక్కడికి చేరుకున్నారు. అక్కడ పలు వస్తువులను సేకరించారు. డెడ్ బాడీకి 20 మీటర్ల దూరంలో పాదరక్షలను, ఓ బ్యాగ్ ను స్వాధీనం చేసుకున్నారు. ఆ బ్యాగ్ లో ఓ బెడ్ షీట్ కూడా ఉంది. అక్కడే ఓ సెల్ ఫోన్ కూడా పోలీసులకు లభించింది. అయితే అందులో సిమ్ కార్డు, అలాగే బ్యాటరీ కూడా లేదు.

నాగోల్ ఫ్లై ఓవర్‌ ప్రారంభం.. మౌలిక సదుపాయాలు పెంచుకోకపోతే బెంగళూరు లాంటి పరిస్థితి వస్తుందన్న కేటీఆర్..

చనిపోయిన వ్యక్తికి దాదాపు 25 - 35 ఏళ్ల మధ్య వయస్సు ఉండవచ్చని, అతడిని మర్డర్ చేసిన తరువాతే ఇలా కాల్చేసి ఉండవచ్చని పోలీసులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఈ కేసు దర్యాప్తులో భాగంగా ఇటీవల కాలంలో తప్పిపోయిన వ్యక్తుల వివరాలను ఆరా తీసేందుకు ప్రయత్నాలు మొదలు పెట్టారు. దీని కోసం స్పెషల్ టీంలను ఏర్పాటు చేశారు.  సైబరాబాద్ క్లూస్ టీం అలాగే స్పెషల్ పోలీసు టీంలు అక్కడి చేరుకున్నాయి. ఆధారాలు సేకరించాయి.

తెలంగాణ‌లో గురువారం నుంచి భార‌త్ జోడో యాత్ర పునఃప్రారంభం !

ఆ శ్మశాన వాటికలో డెడ్ బాడీ లభించిన విధానం, ఆ ప్రాంతంలో లభించిన ఆధారాలు పలు అనుమానాలకు తావిస్తున్నాయి. చనిపోయిన వ్యక్తి శరీరంపై గాయాలు లేవు. ఈ విషయాన్ని పోలీసులు పేర్కొన్నారు. డెడ్ బాడీ లభించిన కొంత దూరంలో బియ్యం పిండి లాంటిది కనిపించింది. దీంతో ఇక్కడ క్షుద్రపూజ జరిగిందేమో అని స్థానికులను అనుమానాలు వ్యక్తం చేస్తున్నా.. పోలీసులు దీనిపై ఓ క్లారిటీ ఇవ్వడం లేదు. మృతదేహానికి దహనం శనివారం జరిగిందని స్థానికులు చెబుతున్నారు. కానీ పోలీసులు మాత్రం ఈ ఘటన ఆదివారం రాత్రి జరిగి ఉంటుుందని భావిస్తున్నారు. అయితే పోస్టుమార్టం రిపోర్టులు వచ్చిన తరువాత, అలాగే దర్యాప్తు ముగిసిన తరువాత మాత్రమే పూర్తి వివరాలు  తెలుస్తాయని పోలీసులు చెబుతున్నారు. అయితే ఎవరైనా డెడ్ బాడీని గుర్తిస్తే.. పోలీస్ స్టేషన్ లో సమాచారం అందించాలని సూచించారు. 

Follow Us:
Download App:
  • android
  • ios