డెంటల్ అండ్ స్కిన్ కేర్ హాస్పిటల్ లో పని చేసే ఓ యువతి.. ట్రిట్ మెంట్ కోసం వచ్చిన ఓ మహిళ కు చెందిన విలువైన ఉంగరాన్ని దాచి పెట్టుకుంది. కానీ పోలీసులకు ఎక్కడ దొరికిపోతానేమో అనే భయంతో దానిని టాయిలెట్ సీటులో పారేసింది. ఈ ఘటన హైదరాబాద్ లో చోటు చేసుకుంది. 

ఓ యువతి డెంటర్ అండ్ స్కిన్ కేర్ సెంటర్ లో పని చేస్తున్నారు. ఓ వ్యాపారవేత్త కోడలు ఆ సెంటర్ కు వచ్చారు. ట్రీట్ మెంట్ తీసుకుంటున్న సమయంలో తన చేతికి ఉన్న వజ్రపు ఉంగరం తీసి పక్కన పెట్టారు. అయితే దానిని ఆ యువతి దాచి పెట్టుకొంది. కానీ ఎక్కడ పోలీసులకు దొరికిపోతానేమో అనే భయంతో టాయిలెట్ సీటులో పారేసింది.

పార్టీలోకి తిరిగి రండి - రెబల్ ఎమ్మెల్యేలకు ఎన్సీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ సుప్రియా సూలే విజ్ఞప్తి

వివరాలు ఇలా ఉన్నాయి. హైదరాబాద్ నగరంలోని జూబ్లీహిల్స్ లో ఎఫ్ఎంఎస్ డెంటల్ అండ్ స్కిన్ కేర్ అనే హాస్పిటల్ ఉంది. ఈ హాస్పిటల్ కు జూన్ 27వ తేదీన బంజారాహిల్స్ కు చెందిన నరేంద్ర కుమార్ అగర్వాల్ కోడలు ట్రీట్ మెంట్ కోసం వచ్చారు. ట్రీట్ మెంట్ సమయంలో ఆమె తన చేతికి ఉన్న వజ్రపు ఉంగారాన్ని తీసి పక్కన ఉంచారు. దాని విలువ సుమారు రూ.50 లక్షలు ఉంటుంది.

ఘోరం.. ఐదేళ్ల కుమారుడిని చంపి, భార్య కూతుర్లపై దాడి చేసి, ఆత్మహత్యకు పాల్పడ్డ వ్యాపారి.. ఎందుకంటే ?

ట్రీట్ మెంట్ పూర్తి అయిన తరువాత ఆమె ఇంటికి వెళ్లారు. కానీ ఉంగరాన్ని అక్కడే మర్చిపోయారు. ఇంటికి వెళ్లిన తరువాత ఆమె తన చేతికి ఉంగరం లేదన్న విషయాన్ని గ్రహించారు. వెంటనే ఆ హాస్పిటల్ కు చేరుకున్నారు. తన ఉంగరం ఇక్కడే పెట్టి మర్చిపోయానని, దానిని తిరిగి ఇవ్వాలని కోరింది. కానీ వారి నుంచి సరైన సమాధానం రాలేదు. దీంతో ఆమె మామ నరేంద్ర కుమార్ జూబ్లీహిల్స్ పోలీసులకు కంప్లైంట్ ఇచ్చారు.

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడి హోదాలో వస్తానో.. లేదో తెలియదు - కార్యకర్తలతో బండి సంజయ్ కుమార్

పోలీసులు రంగంలోకి దిగి హాస్పిటల్ కు చేరుకున్నారు. అక్కడున్న సీసీ కెమెరాల ఫుటేజ్ ను పరిశీలించారు. కానీ అక్కడ వారికి ఉంగరానికి సంబంధించిన ఎలాంటి సమాచారమూ లభించలేదు. అనంతరం అక్కడ పని చేసే సిబ్బందిని ప్రశ్నించారు. ఈ క్రమంలో లాలస అనే యువతి స్పందిస్తూ.. ఎవరో టిష్యూ పేపర్ లో ఉంగరం ఉంచి, తన పర్సులో పెట్టారని తెలిపింది. కానీ తనకు భయం వేసిందని, అందుకే దానిని టాయిలెట్ సీట్ లో పారేశానని తెలిపింది. ఆమె సమాధానం విన్న పోలీసులు, సిబ్బంది సహాయంతో టాయిలెట్ సీటును తొలగించారు. పైప్ లైన్లు కూడా తొలగించడంతో ఆ ఉంగరం లభ్యమైంది. అనంతరం ఆ యువతిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.