వైఎస్ఆర్ మాజీ వ్యక్తిగత సహాయకుడు సూరీడు, ఏపీ ఐజీ పాలరాజుపై కేసు నమోదు.. ఎందుకంటే ?
వైఎస్ రాజశేఖర్ రెడ్డి మాజీ పర్సనల్ అసిస్టెంట్ సూరీడుపై బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు అయ్యింది. అలాగే మరో ముగ్గురు పోలీసు అధికారులపై కూడా కేసు నమోదయ్యింది. ఇందులో ఒకరు ప్రస్తుతం ఏపీలో ఐజీగా పని చేస్తున్నారు.

దివంగత నాయకుడు వైఎస్ రాజశేఖర్ రెడ్డి మాజీ పర్సనల్ అసిస్టెంట్ ఎర్రంరెడ్డి సూర్యనారాయణరెడ్డి అలియాస్ సూరీడు, ప్రస్తుతం ఏపీలో ఐజీగా పని చేస్తున్న పాలరాజుపై, అలాగే మరో ఇద్దరు పోలీసు అధికారులపై హైదరాబాద్ లోని బంజారాహిల్స్ పోలీసులు కేసు నమోదు చేశారు. సూరీడు అల్లుడు సురేందర్‌రెడ్డి దాఖలు చేసిన పిటిషన్ ను పరిగణలోకి తీసుకున్న కోర్టు.. కేసు నమోదు చేయాలని బంజారాహిల్స్ పోలీసులను ఆదేశించడంతో ఈ పరిణామం చోటు చేసుకుంది.
EXCLUSIVE : ఇస్రో తయారీ పరికరాన్ని నాసా ఇష్టపడింది.. తమకే ఇవ్వాలని కోరింది - చైర్మన్ సోమనాథ్
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఏపీలోని కడప జిల్లాకు చెందిన పోతిరెడ్డి సురేందర్ రెడ్డికి, వైఎస్సార్ మాజీ పర్సనల్ అసిస్టెంట్ సూరీడు కూతురుకు కొన్నేళ్ల కిందట వివాహం జరిగింది. కొంత కాలం తరువాత దంపతుల మధ్య విభేదాలు వచ్చాయి. దీంతో సూరీడి కూతురు తన భర్త సురేందర్ రెడ్డిపై వరకట్న వేధింపుల కింద ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేశారు. కాగా.. 2021 మార్చి 23వ తేదీన రాత్రి 7.30 గంటల సమయంలో తన కూతురును చూసేందుకు సురేందర్ రెడ్డి తన మామ నివాసానికి వెళ్లారు. సూరీడు ఇళ్లు జూబ్లీహిల్స్ లో ఉంటుంది. అయితే అక్కడ అల్లుడు, మామల మధ్య వాగ్వాదం జరిగింది. ఈ క్రమంలో అల్లుడిపై మామ దాడికి పాల్పడ్డారు.
ఒకే కుటుంబానికి చెందిన నలుగురు సూసైడ్.. మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయినిలో ఘటన
ఈ సమయంలో జూబ్లీహిల్స్ పోలీసులు అక్కడికి వచ్చారు. సూరీడు అల్లుడిని పోలీసు స్టేషన్ కు తీసుకొని వెళ్లారు. ఆ సమయంలో జూబ్లీహిల్స్ ఇన్‌స్పెక్టర్‌గా రాజశేఖర్‌రెడ్డి, ఎస్సై నరేష్, ప్రస్తుతం ఏపీలో ఐజీగా ఉన్న జి.పాలరాజులు కలిసి తనను అక్రమంగా నిర్భంధించారని సురేందర్ రెడ్డి ఆరోపణలు చేశారు. అలాగే దాడి కూడా చేశారని ఆరోపించారు. అయితే ఈ విషయంలో మంగళవారం సురేందరెడ్డి కోర్టును ఆశ్రయించాడు.
ఘోరం.. గిన్నెకు కాలు తగిలిందని.. 14 ఏళ్ల బాలికను మూడో అంతస్తు నుంచి నెట్టేసిన మహిళ..
తనపై తప్పుడు కేసులు పెట్టిన సూర్యనారాయణరెడ్డి, అక్రమంగా కస్టడీలోకి తీసుకున్న రాజశేఖర్ రెడ్డి, నరేష్, పాలరాజులపై చర్యలు తీసుకోవాలని అభ్యర్థిస్తూ ఆయన థర్డ్ అడిషనల్ చీఫ్ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ ను కోరారు. ఆయన వాంగ్మూలాన్ని జడ్జి పరిశీలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేయాలని బంజారాహిల్స్ పోలీసులకు ఆదేశాలు జారీ చేశారు. దీంతో బంజారాహిల్స్ పోలీసులు కేసు నమోదు చేశారు. దీనిపై దర్యాప్తు కొనసాగుతోంది.