Siddipet: తెలంగాణ ప్రభుత్వం ఆరు నెలల్లో 80 వేల ఉద్యోగ ఖాళీలను భర్తీ చేస్తుందని రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు తెలిపారు. అలాగే, ఇటీవల జరిగిన టీఎస్‌పీఎస్‌సీ ప్రశ్నపత్రం లీక్ అంశాన్ని ప్రస్తావిస్తూ.. లీకేజీని గుర్తించి బాధ్యులపై కేసులు పెట్టింది ప్రభుత్వమేనన్నారు.
Telangana govt to fill 80 thousand job vacancies: వచ్చే ఆరు నెలల్లో 80 వేల వరకు ఉద్యోగ ఖాళీలను భర్తీ చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం సిద్ధమైంది. సిద్ధిపేట నియోజకవర్గంలోని నారాయణరావుపేటలో ఏర్పాటు చేసిన ఆత్మీయ సమ్మేళనంలో రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీశ్ రావు మాట్లాడుతూ ఈ విషయం వెల్లడించారు. అలాగే, రాష్ట్రంలోని యువత ప్రతిపక్షాల ఉచ్చులో పడొద్దని, కెరీర్ పై దృష్టి పెట్టాలని సూచించారు.
ఇటీవల జరిగిన టీఎస్ పీఎస్సీ ప్రశ్నాపత్రం లీకేజీ అంశాన్ని కూడా హరీశ్ రావు ప్రస్తావించారు. లీకేజీని గుర్తించి బాధ్యులపై కేసులు పెట్టింది ప్రభుత్వమేనన్నారు. మీడియా కవరేజ్ తర్వాతే ప్రతిపక్షాలకు ఈ విషయం తెలిసిందని తెలిపారు. దేశవ్యాప్తంగా వివిధ శాఖల్లో ఖాళీగా ఉన్న 16 లక్షల ఉద్యోగాల భర్తీకి బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని మంత్రి ప్రశ్నించారు.
టీఎస్ పీఎస్సీ గ్రూప్-2, గ్రూప్-4 పరీక్షల తేదీలు విడుదల
తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్ పీఎస్సీ) గ్రూప్ 2, 4 ఉద్యోగ ఖాళీల పరీక్ష తేదీలను విడుదల చేసింది. ఆగస్టు 29, 30 తేదీల్లో గ్రూప్-2 పోస్టులకు, జూలై 1న గ్రూప్-4 పోస్టులకు పరీక్ష నిర్వహించాలని కమిషన్ నిర్ణయించింది. రాష్ట్రంలోని వివిధ ప్రభుత్వ శాఖల్లో వేలాది ఉద్యోగ ఖాళీలను భర్తీ చేయడానికి ఈ పరీక్ష దోహదపడుతుంది. తెలంగాణ ప్రభుత్వం చేసిన ఈ ప్రకటన ఉద్యోగార్థులకు ఆశాకిరణంగా నిలిచింది. ఎందుకంటే చాలా కాలం నుంచి ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎంతో మంది ఎదురుచూస్తున్నారు. అయితే, ఇటీవల రిగిన పలు పరీక్షల పేపర్లు లీక్ కావడంతో అభ్యర్థుల్లో ఆందోళన పెరుగుతోంది.
పెద్ద సంఖ్యలో గ్రూప్ పరీక్షలకు సిద్ధమవుతున్న ఉద్యోగార్థులు..
ఉద్యోగార్థులు తెలంగాణలో గ్రూప్ పరీక్షలకు ప్రిపరేషన్ ప్రారంభించారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని తెలంగాణలో ప్రభుత్వ ఉద్యోగం పొందేందుకు ప్రయత్నిస్తున్నారు. చాలా పెద్ద సంఖ్యలో ఉద్యోగార్థులు ప్రిపరేషన్ ఉన్నారు. గ్రూప్స్ పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించేందుకు లైబ్రరీలు, కోచింగ్ సెంటర్లు, గ్రూప్ స్టడీస్ లో చాలామంది కనిపిస్తున్నారు. ఇక అర్హులైన అభ్యర్థులకు ఉచితంగా కోచింగ్ ఇచ్చేందుకు పలు సంస్థలు ముందుకు వస్తుండగా, ప్రైవేటు సంస్థలు భారీగా ఫీజులు వసూలు చేస్తున్న పరిస్థితులు ఉన్నాయి. గ్రూప్-2, 4 పోస్టులకు జులై, ఆగస్టు నెలల్లో పరీక్షలు జరగాల్సి ఉంది.. అయితే తెలంగాణలో రాబోయే అసెంబ్లీ ఎన్నికలకు ముందే ఉద్యోగ ఖాళీల తుది ఫలితాలు వెలువడతాయో లేదో చూడాలి.
