కరీంనగర్ జిల్లాలో 8 నెమళ్లు ఒకేసారి మృత్యువాతపడ్డాయి.

జిల్లాలోని ఇళ్లందకుంట మండల కేంద్రంలో ఈ ఘటన జరిగింది. వివరాలిలా ఉన్నాయి.

గ్రామ శివారులోని రాజిరెడ్డి అనే రైతు తన పొలంలో పంట కోసం విష గుళికలు చల్లారు.

ఆ గులికలు తినడం వల్లనే ఈ నెమళ్లు చనిపోయాయని స్థానికులు అంటున్నారు.

ఒకేసారి 8 నెమళ్లు మృత్యువాత పడడం చర్చనీయాంశమైంది.