తెలంగాణలో మళ్లీ పెరుగుదల, ఒక్కరోజే 79 కేసులు: అన్నీ జీహెచ్ఎంసీ పరిధిలోనే
గత కొద్దిరోజులుగా తెలంగాణలో తగ్గుతూ వస్తున్న కరోనా కేసులు సోమవారం ఒక్కసారిగా పెరిగాయి. సోమవారం రాష్ట్రవ్యాప్తంగా 79 మందికి పాజిటివ్‌గా తేలడంతో ప్రభుత్వ యంత్రాంగం ఉలిక్కిపడింది.
గత కొద్దిరోజులుగా తెలంగాణలో తగ్గుతూ వస్తున్న కరోనా కేసులు సోమవారం ఒక్కసారిగా పెరిగాయి. సోమవారం రాష్ట్రవ్యాప్తంగా 79 మందికి పాజిటివ్‌గా తేలడంతో ప్రభుత్వ యంత్రాంగం ఉలిక్కిపడింది. వీరితో కలుపుకుని మొత్తం కేసుల సంఖ్య 1,275కి చేరింది.
ఇవాళ నమోదైన 79 కేసులు జీహెచ్ఎంసీ పరిధిలోనివే కావడం గమనార్హం. సోమవారం 50 మంది డిశ్చార్జ్ అయ్యారు. ప్రస్తుతం రాష్ట్రంలో 444 మంది ఐసోలేషన్ వార్డుల్లో చికిత్స పొందుతున్నారు.
రోనా వ్యాప్తి నియంత్రణ చర్యల్లో భాగంగా దేశంలో నిలిపేసిన ప్రయాణికుల రైళ్లను ఇప్పుడే పునరుద్ధరించవద్దని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ప్రధాన మంత్రి నరేంద్ర మోడికి విజ్ఞప్తి చేశారు.
Also Read:లాక్‌డౌన్ ఎఫెక్ట్: యాదాద్రి పవర్ ప్లాంట్ వద్ద వలస కార్మికుల ఆందోళన, ఉద్రిక్తత
రాష్ట్రాల అప్పులను రీ షెడ్యూల్ చేయాలని, ఎఫ్ఆర్‌బీఎం పరిమితి పెంచాలని, ఏ రాష్ట్రానికి చెందిన వలస కూలీలను ఆ రాష్ట్రం అనుమతించాలని సిఎం కోరారు. జూలై-ఆగస్టు మాసాల్లోనే కరోనా వ్యాక్సిన్ వచ్చే అవకాశం ఉందన్నారు. మరీ ముఖ్యంగా హైదరాబాద్ నుంచే వచ్చే అవకాశం ఉందని సిఎం ఆశాభావం వ్యక్తం చేశారు కేసీఆర్.
ప్రధాన మంత్రి నరేంద్ర మోడి సోమవారం దేశంలోని అందరు ముఖ్యమంత్రులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్ మాట్లాడారు. కరోనా వ్యాప్తి నియంత్రణకు కేంద్రం, రాష్ట్రాలు కలిసి పనిచేస్తున్నాయని చెప్పారు. దేశంలో సరైన సమయంలో సరైన నిర్ణయాలు తీసుకుంటూ సరైన చర్యలు తీసుకుంటున్నామని అభిప్రాయపడ్డారు.
దేశంలోని ప్రధాన నగరాలైన ఢిల్లీ, ముంబాయి, చెన్నై, హైదరాబాద్ తో పాటు చాలా నగరాల్లో కరోనా ప్రభావం ఉంది. ఈ ప్రాంతాల్లో ఎక్కువ సంఖ్యలో కరోనా బాధితులున్నారు. కాబట్టి ఇప్పుడే ప్రయాణీకుల రైళ్లను నడిపితే ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి రాకపోకలు ఎక్కువగా జరుగుతాయన్నారు.
Also Read:కరోనా మరణాలపై డౌట్స్: సాక్ష్యం ఇదేనని కేటీఆర్ ను ప్రశ్నించిన నెటిజెన్
ఎవరు ఎటు పోతున్నారో తెలియదు. వారికి కరోనో ఉందో లేదో తెలియదు. అందరికీ టెస్టులు చేయడం కుదరదు. రైళ్లలో వచ్చిన ప్రయాణీకులను క్వారంటైన్ చేయడం కూడా కష్టం. కాబట్టి ఇప్పుడిప్పుడే ప్రయాణీకుల రైళ్లను నడపొద్దని కేసీఆర్ ప్రధానిని కోరారు.
కరోనా ఇప్పుడిప్పుడే మనల్ని వదిలి పోయేట్టు కనిపించడం లేదు. కాబట్టి కరోనాతో కలిసి బతకడం మనకు తప్పదు. ఈ విధంగా ప్రజల్ని నడిపించాలి. ముందుగా వారిలో భయాన్ని పోగొట్టాలి. కరోనాతో కలిసి బతకడం నేర్చుకోవాల్సిన అవసరం ఉందన్నారు.