Asianet News TeluguAsianet News Telugu

లాక్‌డౌన్ ఎఫెక్ట్: యాదాద్రి పవర్ ప్లాంట్ వద్ద వలస కార్మికుల ఆందోళన, ఉద్రిక్తత

ఉమ్మడి నల్గొండ జిల్లాలోని దామరచర్లలో నిర్మిస్తున్న యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ లో వలస కార్మికులు సోమవారం నాడు ఆందోళనకు దిగారు. దీంతో ఉద్రిక్తత నెలకొంది. తమను స్వగ్రామాలకు తరలించాలని కార్మికులు డిమాండ్ చేశారు.
 

Tension prevails at Yadadri power plant in Nalgonda district
Author
Hyderabad, First Published May 11, 2020, 1:23 PM IST


నల్గొండ:ఉమ్మడి నల్గొండ జిల్లాలోని దామరచర్లలో నిర్మిస్తున్న యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ లో వలస కార్మికులు సోమవారం నాడు ఆందోళనకు దిగారు. దీంతో ఉద్రిక్తత నెలకొంది. తమను స్వగ్రామాలకు తరలించాలని కార్మికులు డిమాండ్ చేశారు.

యాదాద్రి పవర్ ప్లాంట్ నిర్మాణంలో ఐదు రాష్ట్రాలకు చెందిన 1600 మంది కార్మికులు పనిచేస్తున్నారు. లాక్ డౌన్ కారణంగా వలస కార్మికులు తమ స్వంత గ్రామాలకు వెళ్తామని వారం రోజుల క్రితం ఆందోళనకు దిగారు. ఆ సమయంలో అధికారులు వారిని స్వంత గ్రామాలకు పంపేందుకు అనుమతి ఇస్తామని ప్రకటించారు.

ఈ ప్లాంట్ నిర్మాణంలో బీహార్, జార్ఖండ్, ఛత్తీస్ ఘడ్, పశ్చిమబెంగాల్ రాష్ట్రాలకు చెందిన కార్మికులు పనిచేస్తున్నారు. వీరంతా తమ స్వంత గ్రామాలకు వెళ్లేందుకు ఆన్ లైన్ లో అనుమతులు పొందారు. 107 మంది కార్మికులను రెండు రోజుల క్రితం హైద్రాబాద్ కు తరలించారు.  వారందరిని స్వంత గ్రామాలకు తరలించారు.

also read:15న అధికారులతో భేటీ: ఆర్టీసీ బస్సుల రాకపోకలపై కేసీఆర్ సర్కార్ తేల్చేనా

కార్మికులను స్వంత గ్రామాలకు తరలించేందుకు ఇవాళ ఎలాంటి ఏర్పాట్లు చేయకపోవడంతో సుమారు 250 మంది కార్మికులు తమ లగేజీని తీసుకొని కాలినడకన బయలుదేరారు.

నిన్న కూడ కార్మికులు తమను స్వంత గ్రామాలకు తరలించాలని కోరుతూ ఆందోళన చేశారు. ఇవాళ కూడ ఆందోళన నిర్వహించారు. కార్మికుల ఆందోళన విషయం తెలుసుకొన్న పోలీసులు ఫ్యాక్టరీ వద్దకు చేరుకొన్నారు. దీంతో ఉద్రిక్తత నెలకొంది. ఆన్ లైన్ లో అనుమతులు పొందినా తమను ఎందుకు పంపడం లేదని కార్మికులు పోలీసులతో వాగ్వాదానికి దిగారు.
 

Follow Us:
Download App:
  • android
  • ios