కరోనా మరణాలపై డౌట్స్: సాక్ష్యం ఇదేనని కేటీఆర్ ను ప్రశ్నించిన నెటిజెన్
ట్విట్టర్ లో ఒక వ్యక్తి పెట్టిన ఒక పోస్టు తెలంగాణాలో కరోనా వైరస్ మరణాలను కూడా తక్కువగా చూపెడుతున్నారా అనే అనుమానం కలిగిస్తుంది. మే 9వ తేదీనాడు కరోనా పాజిటివ్ గా నిర్ధారించబడి, మే 10వ తేదీన చనిపోయిన ఒక వ్యక్తి మరణాన్ని మే 10వ తేదీన ప్రకటించకపోవడం ఇక్కడ అనేక అనుమానాలకు తావిస్తోంది.
కరోనా వైరస్ మహమ్మారి విషయంలో తెలంగాణ ప్రభుత్వంపై పలువురు పలు రకాలైన ఆరోపణలు చేస్తున్న విషయం మన అందరికి తెలిసిందే! తాజాగా తెలంగాణ హై కోర్ట్ కూడా తెలంగాణ ప్రభుత్వాన్ని కరోనా వైరస్ టెస్టులను తక్కువగా చేస్తుండడంపై అక్షింతలు వేసిన విషయం తెలిసిందే! కేంద్ర ఆరోగ్య శాఖామంత్రి హర్షవర్ధన్ కూడా తెలంగాణాలో టెస్టింగ్ తక్కువగా ఉందని అభిప్రాయపడ్డారు.
ఇకపోతే... తాజాగా ట్విట్టర్ లో ఒక వ్యక్తి పెట్టిన ఒక పోస్టు తెలంగాణాలో కరోనా వైరస్ మరణాలను కూడా తక్కువగా చూపెడుతున్నారా అనే అనుమానం కలిగిస్తుంది. మే 9వ తేదీనాడు కరోనా పాజిటివ్ గా నిర్ధారించబడి, మే 10వ తేదీన చనిపోయిన ఒక వ్యక్తి మరణాన్ని మే 10వ తేదీన ప్రకటించకపోవడం ఇక్కడ అనేక అనుమానాలకు తావిస్తోంది.
వివరాల్లోకి వెళితే... అశోక్ అనే ఒక వ్యక్తి బాబాయి మే 10వ తేదీన కరోనా వైరస్ తో మరణించాడని, వారి కుటుంబమంతా క్వారంటైన్ లో ఉందని, ఆ వ్యక్తి ట్వీట్ చేసాడు. ఏకంగా కేటీఆర్ ఆఫీస్ను, ఈటల రాజేందర్ నే టాగ్ చేస్తూ... దీనిపై క్లారిటీ కావాలని కోరాడు.
వ్యక్తి ఎప్పుడో బులెటిన్ విడుదలయ్యేటప్పుడో, ఆ తరువాతో మరణించాడు అని అనుకోకండి. ఆవ్యక్తి నిన్న ఉదయం 10 గంటలకు మరణించాడు. అంటే అప్పటి నుండి రాత్రి బులెటిన్ విడుదలవటానికి మధ్య ఉన్న సమయం 10 గంటలు. అప్పటికి కూడా అప్డేట్ అవ్వలేదు అని అనుకోవడానికి లేదు.
ఈ విషయంలో ప్రభుత్వం ఇప్పటికైనా క్లారిటీ ఇవ్వాలి. కరోనా వైరస్ విషయంలో విషయాల్లాని ఉన్నవి ఉన్నట్టుగా చెప్పినప్పుడే ఈ మహమ్మారిపై ఒక కరెక్ట్ అవగాహన వస్తుందని పలువురు అభిప్రాయపడుతున్నారు.