ఒక్కరోజులో 71 మందికి పాజిటివ్: తెలంగాణలో 2 వేలకు చేరువలో కరోనా కేసులు

తెలంగాణలో కరోనా కేసుల సంఖ్య మంగళవారం అమాంతం పెరిగిపోయింది. ఒకే రోజు 71 కేసులు నమోదవ్వడంతో ప్రభుత్వం ఉలిక్కిపడింది. వీటితో కలిపి రాష్ట్రంలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 1,991కి చేరింది

71 new corona cases reported in telangana

తెలంగాణలో కరోనా కేసుల సంఖ్య మంగళవారం అమాంతం పెరిగిపోయింది. ఒకే రోజు 71 కేసులు నమోదవ్వడంతో ప్రభుత్వం ఉలిక్కిపడింది. వీటితో కలిపి రాష్ట్రంలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 1,991కి చేరింది. తెలంగాణలో ఇవాళ కరోనాతో ఒకరు మృతి చెందడంతో మరణాల సంఖ్య 57కి చేరుకుంది.

అయితే ఒక్కరోజే 120 మంది డిశ్చార్జ్ కావడంతో కోలుకున్న వారి సంఖ్య 1,284కి చేరింది. ప్రస్తుతం తెలంగాణలో 650 మంది వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. ఇవాళ జీహెచ్ఎంసీ పరిధిలో 38, రంగారెడ్డి 7, మేడ్చల్‌లో 6 , సూర్యాపేట, వికారాబాద్, నల్గొండ, నారాయణ్ పేట్‌లో ఒక్కొక్కరికి,  మరో 12 మంది వలసకూలీలకు కరోనా సోకింది.

Also Read:నివేదికలివ్వండి: కరోనా పరీక్షలపై తెలంగాణ సర్కార్ పై హైకోర్టు అసంతృప్తి

కాగా మార్చి 11వ తేదీ నుండి ఇప్పటివరకు రాష్ట్రంలో నిర్వహించిన కరోనా పరీక్షల వివరాలు ఇవ్వాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది తెలంగాణ హైకోర్టు. కరోనా పరీక్షల నిర్వహణపై తెలంగాణ హైకోర్టు మంగళవారం నాడు విచారణ నిర్వహించింది.

మృతదేహాలకు కరోనా పరీక్షలు అవసరం లేదని తెలంగాణ ప్రభుత్వం జారీ చేసిన జీవోను హైకోర్టు  కొట్టివేసింది. కరోనా పరీక్షల నిర్వహణ విషయంలో కేంద్ర ప్రభుత్వం నుండి రాష్ట్రానికి రెండు సార్లు వచ్చిన లేఖలను సమర్పించాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.

Also Read:వలసకూలీలతోనే కరోనా.. జాగ్రత్తగా ఉండాలి.. ఎర్రబెల్లి దయాకర్ రావు...

రాష్ట్రంలో కరోనా కేసుల విషయమై ఈ ఏడాది జూన్ 4వ తేదీలోపుగా నివేదిక ఇవ్వాలని హైకోర్టు ఆదేశించింది. రాష్ట్రంలో కరోనా పరీక్షలు నిర్వహణ తీరుపై హైకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. 

లక్షణాలు లేని హైరిస్క్ ఉన్నవారికి కరోనా పరీక్షలు ఎందుకు నిర్వహించడం లేదని హైకోర్టు ప్రశ్నించింది. అంతేకాదు ఇతర రాష్ట్రాలతో పోలిస్తే తక్కువ పరీక్షలు ఎందుకు చేస్తున్నారని హైకోర్టు ప్రశ్నించింది.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios