Asianet News TeluguAsianet News Telugu

తెలంగాణ పెరుగుతున్న కేసులు, కొత్తగా 47 మందికి కరోనా: 1,414కు చేరిన సంఖ్య

తెలంగాణలో గురువారం కొత్తగా 47 కరోనా కేసులు నమోదైనట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది. వీటితో కలిపి రాష్ట్రంలో మొత్తం కోవిడ్ 19 కేసుల సంఖ్య 1,414కు చేరుకుంది. 

47 new corona cases reported in telangana
Author
Hyderabad, First Published May 14, 2020, 9:22 PM IST

తెలంగాణలో గురువారం కొత్తగా 47 కరోనా కేసులు నమోదైనట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది. వీటితో కలిపి రాష్ట్రంలో మొత్తం కోవిడ్ 19 కేసుల సంఖ్య 1,414కు చేరుకుంది. ఇప్పటి వరకు 34 మంది వైరస్ కారణంగా ప్రాణాలు కోల్పోగా.. ఇవాళ కొత్తగా 13 మంది డిశ్చార్జ్ అవ్వడంతో, కోలుకున్న వారి సంఖ్య 952కు చేరింది.

ప్రస్తుతం రాష్ట్రంలో 428 యాక్టివ్ కేసులున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది. గురువారం జీహెచ్ఎంసీ పరిధిలో 40, రంగారెడ్డి జిల్లాలో ఐదుగురికి, ఇతర రాష్ట్రాలకు చెందిన ఇద్దరు వలస కూలీలకు కరోనా సోకినట్లు వైద్య ఆరోగ్య శాఖ పేర్కొంది. 

Also Read:ఈ రెండు లక్షణాలు కనపడితే పరీక్షలు చేయాల్సిందే.. ఈటల

కాగా రాష్ట్రంలో కరోనా కేసుల నివారణ, తదితర అంశాలపై ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్.. వైద్య అధికారులు, సిబ్బందితో చర్చించారు. గురువారం వీడియో కాన్ఫరెన్స్ లో మాట్లాడిన ఆయన వైద్య సిబ్బందికి పలు ఆదేశాలు చేశారు.

కరోనా నేపథ్యంలో ప్రతీ గ్రామంలో ప్రతి ఇంటికి తిరిగి ఇన్‌ప్లూయెంజా లక్షణాలు(జలుబు, దగ్గు, జ్వరం, గొంతునొప్పి), ఊపిరితిత్తుల న్యుమెనియా వంటి రెండు లక్షణాలు ఎవరికైనా కనిపిస్తే తప్పనిసరిగా పరీక్షలు నిర్వహించాలని మంత్రి వైద్య సిబ్బందిని కోరారు.

Also Read:చేయాల్సిందే: కరోనా పరీక్షలపై కేసీఆర్ సర్కార్‌కి హైకోర్టు షాక్

అనంతరం కరోనాకు సంబంధించి గ్రామాల్లో, పట్టణాల్లో తీసుకుంటున్న చర్యలపై సమీక్షించారు. ఈ సందర్భంగా  ఈటెల రాజేందర్‌ పలువురు ఆశా వర్కర్లు, ఏఎన్‌ఎం వర్కర్లతో మాట్లాడారు.

ఈ కార్యక్రమంలో ఆరోగ్య శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ శాంతి కుమారి, కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ డాక్టర్ యోగీతా రాణా, డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ డాక్టర్ రమేష్ రెడ్డి, డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ డాక్టర్ శ్రీనివాసరావు, టిఎస్‌ఐఎండిసి ఎండీ చంద్రశేఖర్ రెడ్డి, కాళోజీ యూనివర్సిటీ వైస్ చాన్సలర్ డాక్టర్ కరుణాకర్ రెడీ, ఎక్స్పర్ట్స్ కమిటీ సభ్యులు డాక్టర్ గంగాధర్ పాల్గొన్నారు.
 

Follow Us:
Download App:
  • android
  • ios