చేయాల్సిందే: కరోనా పరీక్షలపై కేసీఆర్ సర్కార్‌కి హైకోర్టు షాక్
మృతదేహాలకు కరోనా టెస్టులునిర్వహించాలని ప్రభుత్వాన్ని తెలంగాణ హైకోర్టు గురువారం నాడు ఆదేశించింది.మృతదేహాలకు కరోనా పరీక్షలు నిర్వహించాల్సిన అవసరం లేదని తెలంగాణ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే.
హైదరాబాద్: మృతదేహాలకు కరోనా టెస్టులునిర్వహించాలని ప్రభుత్వాన్ని తెలంగాణ హైకోర్టు గురువారం నాడు ఆదేశించింది.మృతదేహాలకు కరోనా పరీక్షలు నిర్వహించాల్సిన అవసరం లేదని తెలంగాణ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే.
ఐసీఎంఆర్ మార్గదర్శకాల ప్రకారంగానే కరోనా పరీక్షలు నిర్వహిస్తున్నట్టుగా తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది. అయితే తెలంగాణ ప్రభుత్వం తీసుకొన్న నిర్ణయాన్ని సవాల్ చేస్తూ ప్రొఫెసర్ విశ్వేశ్వరావు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
also read:నాడు సమ్మె, నేడు లాక్‌డౌన్‌తో 55 రోజులుగా నిలిచిన బస్సులు: తెలంగాణ ఆర్టీసీపై దెబ్బ మీద దెబ్బ
కరోనా టెస్టులు నిర్వహించకపోతే కరోనా మూడో స్టేజీకి వెళ్లే ప్రమాదం ఉందని పిటిషనర్ అభిప్రాయపడ్డారు. ప్రపంచ ఆరోగ్య సంస్థతో పాటు వివిధ సంస్థలు ఇచ్చిన గైడ్ లైన్స్ పాటించాలని పిటిషనర్ తరపు న్యాయవాది హైకోర్టులో వాదనలను విన్పించారు.
కరోనా పరీక్షల విషయమై తెలంగాణ ప్రభుత్వం ఇచ్చిన నివేదికపై హైకోర్టు అసంతృప్తిని వ్యక్తం చేసింది. కేంద్రం ఏ రకమైన నిబంధనలు పాటిస్తోందో నివేదించాలని తెలంగాణ ప్రభుత్వాన్ని కోర్టు ఆదేశించింది.ఈ నెల 26వ తేదీ వరకు స్పష్టమైన నివేదిక ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరింది హైకోర్టు. ఐసీఎంఆర్ మార్గదర్శకాల ప్రకారంగా మృతదేహాలకు పరీక్షలు నిర్వహించాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.