40 కేసుల్లో నిందితుడు.. వేషాలు మారుస్తూ పరారీలోనే, 15 ఏళ్లుకు చిక్కిన కేటుగాడు
15 ఏళ్లుగా ఓ మోసగాడిని పట్టుకునేందుకు ప్రయత్నిస్తున్న పోలీసులు ఎట్టకేలకు సక్సెస్ అయ్యారు.ఇన్నేళ్లుగా యాచకుడి అవతారమెత్తి తప్పించుకుని తిరుగుతున్న నిందితుడు శ్రీనివాసును సినీఫక్కీలో పట్టుకున్నారు ఖాకీలు
15 ఏళ్లుగా ఓ మోసగాడిని పట్టుకునేందుకు ప్రయత్నిస్తున్న పోలీసులు ఎట్టకేలకు సక్సెస్ అయ్యారు.ఇన్నేళ్లుగా యాచకుడి అవతారమెత్తి తప్పించుకుని తిరుగుతున్న నిందితుడు శ్రీనివాసును సినీఫక్కీలో పట్టుకున్నారు ఖాకీలు.
15 ఏళ్లుగా 40 కేసుల్లో నిందితుడిగా వున్నాడు శ్రీనివాస్. వరంగల్ ఆర్ఏసీ నుంచి ఇంజనీరింగ్ చేసిన శ్రీనివాస్.. పలు బ్యాంకులను మోసం చేసి తప్పించుకుని తిరుగుతున్నాడు. ఉన్నత కుటుంబంలో పుట్టి.. జల్సాలకు అలవాటు పడ్డాడు. ఇప్పుడు కటకటాల పాలయ్యాడు.
Also Read:ప్రియుడి కోసం సొంతింట్లో భార్య దోపిడీ.. ఆ విషయం తెలియని భర్త..!
నకిలీ కిసాన్ వికాస్ పత్రాలను సృష్టించి అనేక బ్యాంకులను బురిడీ కొట్టించాడు. దాదాపు కోటిరూపాయలకు పైగా బ్యాంకులని మోసం చేసి జైలులో శిక్షను అనుభవించాడు. జైలు నుంచి బయటికి వచ్చాక నకిలీ పేర్లతో కరీంనగర్, నిజామాబాద్, వరంగల్, గుంటూరులలో నకిలీ ఆధార్ కార్డులతో ,నకిలీ పాన్ కార్డులతో మోసాలు చేస్తూ తప్పించుకు తిరుగుతున్నాడు.
ఇతనిపై సుమారు 40కి పైగా నాన్ బెయిలబుల్ కేసులు నమోదవ్వడంతో అజ్ఞాతంలోకి వెళ్ళిపోయాడు. పడమూడేళ్లు పోలీసులకు దొరక్కుండా అజ్ఞాత జీవితం గడిపిన శ్రీనివాస్ రావును కరీంనగర్ పోలీసులు బెంగళూరులో అదుపులోకి తీసుకున్నారు. కాగా కరీంనగర్ జిల్లాలో శ్రీనివాస రావుపై 23 కేసులున్నాయని మీడియా సమావేశంలో వెల్లడించారు సీపీ కమలాసన్ రెడ్డి