హైద్రాబాద్ లో ఓ ఇంట్లో గ్యాస్ సిలిండర్ పేలింది. దీంతో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. 


హైదరాబాద్: హైద్రాబాద్ మలక్‌పేట వెంకటాద్రినగర్‌లో గల అపార్ట్‌మెంట్ లో ఆదివారం నాడు తెల్లవారుజామున గ్యాస్ సిలిండర్ పేలుడు చోటు చేసుకొంది. ఈ ఘటనలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించారు.

Also read:గద్వాలలో ట్రయాంగిల్ లవ్ స్టోరీ: మరో ప్రియుడితో కార్తీక్ హత్య, ప్రియురాలు సూసైడ్


హైద్రాబాద్ మలక్‌పేటలో అపార్ట్ మెంట్ లో ఆదివారంనాడు తెల్లవారుజామున గ్యాస్ సిలిండర్ పేలింది. దీంతో లక్ష్మయ్య, యాదమ్మ, మోక్షజ్చ , తేజస్విని గాయపడ్డారు.గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో వారికి చికిత్స పొందుతున్నారు. ఈ పేలుడు ధాటికి ఇంటితో పాటు ఇంటి ఆవరణలో పార్క్ చేసిన వాహనాలు కూడ ధ్వంసమయ్యాయి.