తెలంగాణ‌లో కరోనా వైరస్ కంట్రోల్‌లోనే వుంది. గడిచిన 24 గంటల్లో కొత్తగా 3,762 మందికి పాజిటివ్‌గా తేలినట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది. తెలంగాణలో కోవిడ్ వల్ల 20 మంది ప్రాణాలు విడిచారు. రాష్ట్రంలో ఇప్పటి వరకు మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య‌ 5,63,903కు చేర‌గా.. మ‌ర‌ణాల సంఖ్య 3189కు పెరిగింది.

ప్ర‌స్తుతం తెలంగాణలో 38,632 యాక్టివ్ కేసులున్నాయి. రాష్ట్రంలో కరోనా రికవరీ రేటు 92.52 శాతం వుండగా.. పాజిటివిటీ రేటు 6 శాతం నుంచి 4.1 శాతానికి పడిపోయిందని ప్రభుత్వం తెలిపింది. కోవిడ్ నుంచి 3,816 మంది కోలుకున్నారు. అత్యధికంగా జీహెచ్‌ఎంసీ పరిధిలో 528 కేసులు నమోదయ్యాయి. 

Also Read:జర్నలిస్టులూ ఫ్రంట్‌లైన్ వారియర్లే, 28 నుంచి వ్యాక్సినేషన్: తెలంగాణ డీహెచ్ ప్రకటన

ఇక జిల్లాల వారీగా కేసుల విషయానికి వస్తే.. ఆదిలాబాద్ 8, భద్రాద్రి కొత్తగూడెం 128, జగిత్యాల 70, జనగామ 45, జయశంకర్ భూపాలపల్లి 51, జోగులాంబ గద్వాల 73, కామారెడ్డి 26, కరీంనగర్ 170, ఖమ్మం 214, కొమరంభీం ఆసిఫాబాద్ 24, మహబూబ్‌నగర్ 158, మహబూబాబాద్ 141, మంచిర్యాల 103, మెదక్ 43, మేడ్చల్ మల్కాజిగిరి 213, ములుగు 39, నాగర్ కర్నూల్ 104, నల్లగొండ 218, నారాయణ పేట 25, నిర్మల్ 16, నిజామాబాద్ 45, పెద్దపల్లి 137, రాజన్న సిరిసిల్ల 56, రంగారెడ్డి 229, సంగారెడ్డి 98, సిద్దిపేట 131, సూర్యాపేట 178, వికారాబాద్ 101, వనపర్తి 93, వరంగల్ రూరల్ 102, వరంగల్ అర్బన్ 158, యాదాద్రి భువనగిరిలలో 45 చొప్పున కేసులు నమోదు అయ్యాయి.