తెలంగాణలో తగ్గుముఖం పడుతున్న కరోనా .. కొత్తగా 3660 మందికి పాజిటివ్

తెలంగాణలో కరోనా రెండో దశ వ్యాప్తి కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో 69,252 శాంపిల్స్‌ను పరీక్షించగా.. 3,660 మందికి పాజిటివ్‌‌గా తేలినట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది. వీటితో కలిపి ఇప్పటి వరకు నమోదైన మొత్తం కేసుల సంఖ్య 5,44,263 చేరింది.

3660 new corona cases reported in telangana ksp

తెలంగాణలో కరోనా రెండో దశ వ్యాప్తి కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో 69,252 శాంపిల్స్‌ను పరీక్షించగా.. 3,660 మందికి పాజిటివ్‌‌గా తేలినట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది.  వీటితో కలిపి ఇప్పటి వరకు నమోదైన మొత్తం కేసుల సంఖ్య 5,44,263 చేరింది.

ఇవాళ కోవిడ్‌తో 23 మంది ప్రాణాలు కోల్పోగా ఇప్పటి వరకు మొత్తం మృతుల సంఖ్య 3,060కి పెరిగింది. గురువారం వైరస్ నుంచి 4,826 మంది కోలుకున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం బులిటెన్‌‌లో వెల్లడించింది. ప్రస్తుతం తెలంగాణలో 45,757 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. ఒక్క జీహెచ్‌ఎంసీ పరిధిలో 574 మందికి కొత్తగా పాజిటివ్‌ నిర్ధారణ అయినట్లు వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. 

Also Read:కరోనా : పోరాడి ఓడిన సంజన.. వారం వ్యవధిలో తల్లిదండ్రులు మృతి ! తమ్ముడితో సహా పాజిటివ్ బారినపడి

ఆతర్వాత వరుసగా .. ఆదిలాబాద్ 16, భద్రాద్రి కొత్తగూడెం 121, జగిత్యాల 93, జనగామ 38, జయశంకర్ భూపాల్‌పల్లి 45, జోగులాంబ గద్వాల్ 55, కామారెడ్డి 31, కరీంనగర్ 147, ఖమ్మం 217, కొమరంభీం ఆసిఫాబాద్ 23, మహబూబ్‌నగర్ 128, మహబూబాబాద్ 72, మంచిర్యాల 108, మెదక్ 47, మేడ్చల్ మల్కాజ్‌గిరి 218, ములుగు 51, నాగర్‌కర్నూల్ 118, నల్గొండ 166 నారాయణ్ పేట్ 33, నిర్మల్ 18, నిజామాబాద్ 59, పెద్దపల్లి 120, రాజన్న సిరిసిల్ల 66,  రంగారెడ్డి 247, సంగారెడ్డి 106, సిద్దిపేట 116, సూర్యాపేట 110, వికారాబాద్ 112, వనపర్తి 80, వరంగల్ రూరల్ 103, వరంగల్ అర్బన్ 131, యాదాద్రి భువనగిరిలో 91 చొప్పున కేసులు నమోదయ్యాయి. 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios