మెదక్ జిల్లా పాపన్నపేట మండలం పోడ్చన్ పల్లిలో 120 అడుగుల లోతులో ఉన్న బోరు బావిలో మూడేళ్ల బాలుడు పడిపోయాడు. బోరు బావిలో పడిన బాలుడిని రక్షించేందుకు అధికారులు ప్రయత్నాలు ప్రారంభించారు.

120 అడుగుల లోతువరకు బోరును తవ్వారు. అయినా కూడ నీళ్లు పడలేదు. దీంతో ఈ బావిని పూడ్చివేయలేదు. బుధవారంనాడు ఆడుకొంటూ వెళ్లి ఆ బాలుడు బోరుబావిలో పడిపోయాడు. ఈ బాలుడిని సంజయ్ సాయి వర్దన్ గా గుర్తించారు.

ఈ విషయం తెలుసుకొన్న అధికారులు సంఘటన స్థలానికి చేరుకొంటున్నారు. బాలుడిని రక్షించే ప్రయత్నాలను ప్రారంభించారు.

తెలుగు రాష్ట్రాల్లో బోరు బావిలో పిల్లలు పడిన ఘటనలు గతంలో కూడ చోటు చేసుకొన్నాయి. తెలుగు రాష్ట్రాలతో పాటు దేశ వ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో కూడ ఈ తరహా ఘటనలు చోటు చేసుకొన్నా కూడ బోర్లలో నీళ్లు రాకపోతే పూడ్చివేయకుండా నిర్లక్ష్యంగా వదిలేస్తున్నారు.

గోవర్ధన్ అనే రైతు తన పొలంలో నిన్న మూడు బోర్లు వేశాడు. అయితే ఈ మూడు బోర్లలో నీళ్లు పడలేదు. బోర్లను బుధవారంనాడు పూడ్చివేసేందుకు ప్రయత్నిస్తున్నాడు. ఈ సమయంలోనే బోరు బావిలోనే మూడేళ్ల చిన్నారి పడిపోయాడు. ఈ బాలుడు ఆడుకొంటున్న విషయాన్ని గోవర్ధన్ గుర్తించలేదు. గోవర్ధన్, నవీన దంపతులకు ముగ్గురు కొడుకులు. అందరికంటే చిన్నవాడు సాయి వర్ధన్. అయితే సాయివర్ధన్ ఆడుకొంటూ వెళ్లి బోరుబావిలో పడిపోయాడు. 

నాలుగు జేసీబీలు సంఘటన స్థలానికి చేరుకొని బోరు బావికి సమాంతరంగా తవ్వుతున్నారు. సంఘటన స్థలానికి చందనా దీప్తి చేరుకొన్నారు. మరో వైపు హైద్రాబాద్ నుండి రెస్క్యూ టీమ్ కూడ బయలుదేరింది.

 మూడు బోరు బావులు పడలేదు. పూడ్చే క్రమంలో ఉన్నాడు. బోరు బావిలో పడిపోయారని చెబుతున్నారు. ఎంత లోతులో బాలుడు బోరు బావిలో ఎంత లోతులో ఉన్నాడనే విషయాన్ని గుర్తించేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారు.