దసరారోజు స్నేహితులతో కలిసి మద్యం సేవిస్తుంటే.. పిడుగుపడి ముగ్గురి మృతి...
దసరా నాడు వరంగల్ జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. పిడుగుపాటుకు గురై ముగ్గురు యువకులు అక్కడికక్కడే మృతి చెందారు.
వరంగల్ : తెలంగాణలో గత కొద్ది రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ వర్షాల కారణంగా దసరా వారి జీవితాల్లో విషాదాన్ని నింపింది. భారీగా కురుస్తున్న వర్షాల కారణంగా దసరా పండుగనాడు ముగ్గురు యువకుల జీవితాలు అర్థాంతరంగా ముగిశాయి. పిడుగుపాటుకు గురై ముగ్గురు యువకులు అక్కడికక్కడే మృతి చెందారు. వర్ధన్న పేట మండలం బండవతపురం గ్రామ శివారులో దసరా సందర్బంగా మిత్రులతో కలిసి మద్యం సేవిస్తున్న క్రమంలో ఒక్కసారిగా పిడుగుపడి శివ, హరికృష్ణ, సందీప్ లు మృత్యువాత పడ్డారు. ఘటనా స్థలిలో మొత్తం ఏడుగురు ఉండగా ముగ్గురు మృతి చెందారు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. వీరిని వర్ధన్నపేట ప్రభుత్వాసుపత్రికి తరలించారు.
ఇదిలా ఉండగా, తెలంగాణలోని పలు చోట్ల కురుస్తున్న భారీ వర్షాలు, పిడుగుపాటు కారణంగా ఆగస్ట్ 4న ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. చనిపోయిన ముగ్గురు రైతులు పొలంలో పనిచేస్తుండగా, పిడుగుపాటుకు గురయ్యారు. వివరాల్లోకెళ్తే.. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో ఆగస్ట 3,4 తేదీల్లో పిడుగుపాటుకు గురై పొలంలో పనిచేస్తున్న ముగ్గురు రైతులు మృతి చెందగా, ఉరుములతో కూడిన వర్షంతో వరంగల్ జిల్లావ్యాప్తంగా పలు నివాస కాలనీలు జలమయమై దైనందిన జీవనాన్ని అస్తవ్యస్తం చేశాయి.
ఆషామాషీగా జాతీయ పార్టీ పెట్టలేదు.. సీఎంగానే దేశమంతా తిరుగుతా, మహారాష్ట్ర నుంచే మొదలు : కేసీఆర్
మృతులు చిట్యాల మండలం గోపాల్‌పూర్ గ్రామానికి చెందిన ఆరెపల్లి వానమ్మ (56), రేగొండ మండలం పొనగండ్ల గ్రామానికి చెందిన వంగ రవి (48), మల్హర్ మండలం చట్రాజపల్లి గ్రామానికి చెందిన కాటం రఘుపతిరెడ్డి (25)గా గుర్తించారు. కాగా, వరంగల్ నగరంలో మంగళవారం రాత్రి నుంచి బుధవారం ఉదయం వరకు కురిసిన భారీ వర్షాలతో కాలనీలు నీట మునిగాయి. వరంగల్ నగరంలో ఆగస్ట్ 4న అత్యధికంగా 140 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. సాయిగణేష్ నగర్, ఎస్ఆర్ నగర్, గరీబ్ నగర్, ఎన్టీఆర్ నగర్, శివ నగర్ కాలనీలు ఎక్కువగా దెబ్బతిన్నాయి. నగరంలోని సంతోషి మాత టెంపుల్ రోడ్డు, బృందావన్ కాలనీకి వెళ్లే రహదారులు నీటమునిగడంతో వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. దీంతోపాటు హన్మకొండలోని హంటర్ రోడ్డు కూడా జలమయమైంది