హైదరాబాద్: లండన్ నుండి తెలంగాణ రాష్ట్రానికి 2 వేల 300 మంది ప్రయాణీకులు వచ్చినట్టుగా అధికారులు గుర్తించారు. యూకేలో కరోనా వైరస్ రూపాంతరం చెందింది. కొత్త రకం వైరస్ స్ట్రెయిన్ యూకేను వణికిస్తోంది. దీంతో తెలంగాణ ప్రభుత్వం ముందు జాగ్రత్త చర్యలు తీసుకొంటుంది.

యూకే నుండి ఇండియాకు ఇవాళ్టి నుండి ఈ నెలాఖరు వరకు భారత్ విమానాలను నిషేధించింది.  స్ట్రెయిన్  వైరస్ తెలంగాణలో ప్రవేశించకుండా వైద్య ఆరోగ్య శాఖ ముందు జాగ్రత్త చర్యలు తీసుుకొంటుంది.

రాష్ట్రంలోని ప్రధాన ఎయిర్ పోర్టు శంషాబాద్ లో వైద్య ఆరోగ్య శాఖాధికారులు మళ్లీ కరోనా పరీక్షలను ప్రారంభించారు. ఎయిర్ పోర్టులోనే ఆర్టీపీసీఆర్ పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఎయిర్ పోర్టులోనే సర్వేలైన్స్  ఏర్పాటు చేశారు.

also read:స్ట్రెయిన్ : అప్రమత్తమైన తెలంగాణ సర్కార్

ఈ నెల  ప్రారంభం నుండి ఇప్పటివరకు రాష్ట్రానికి యూకే నుండి 2 వేల 300 మంది వచ్చినట్టుగా అధికారులు గుర్తించారు. వీరంతా ఎక్కడెక్కడ ఉన్నారనే విషయాన్ని అధికారులు గుర్తించే పనిలో ఉన్నారు.

విదేశాల నుండి వచ్చేవారికి  కచ్చితంగా కరోనా పరీక్షలు నిర్వహిస్తున్నారు. నెగిటివ్ వచ్చిన ప్రయాణీకులను కూడ వారం రోజుల పాటు  క్వారంటైన్ లో  ఉండాలని ప్రభుత్వం ఆదేశించింది. పాజిటివ్ వచ్చిన వారిని ఆసుపత్రికి తరలించనున్నారు.