హైదరాబాద్: యూకే లో స్ట్రెయిన్ విజృంభిస్తున్న తరుణంలో తెలంగాణ ప్రభుత్వం అప్రమత్తమైంది.  కొత్త రకం వైరస్ స్ట్రెయిన్ రాష్ట్రంలోకి ప్రవేశించకుండా జాగ్రత్తలు తీసుకొంటుంది.

గత వారం రోజుల నుండి విదేశాల నుండి రాష్ట్రానికి తిరిగి వచ్చిన వాళ్లను తెలంగాణ ప్రభుత్వం ట్రాక్ చేయాలని నిర్ణయం తీసుకొంది.గతంలో మాదిరిగా ఎయిర్ పోర్టుల్లో కరోనా సర్వేలైన్స్ ఏర్పాటు చేయనున్నారు. అక్కడే ఆర్టీపీసీఆర్ టెస్టులను నిర్వహించాలని తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ నిర్ణయించింది.

కరోనా పాజిటివ్ వచ్చినవాళ్లను ఎయిర్ పోర్టు నుండి నేరుగా ఆసుపత్రికి తరలించనున్నారు. నెగిటివ్ వచ్చినా కూడ వారం రోజుల పాటు క్వారంటైన్ లో ఉండాలని వైద్య ఆరోగ్య శాఖాధికారులు ఆదేశించారు.

కరోనా కేసులు రోజు రోజుకి తగ్గుతున్న సమయంలో కరోనా రెండో రకం వైరస్ స్ట్రెయిన్ తిరిగి రాష్ట్రంలోకి ప్రవేశించకుండా జాగ్రత్తలు తీసుకొంటుంది.

యూకేకు హైద్రాబాద్ కు రెండు డైరెక్ట్ విమానాలున్నాయి. ఎనిమిది కనెక్టింగ్ విమానాలున్నాయి. ప్రతి రోజూ సుమారు 200 వందల నుండి 500 మంది ప్రయాణీకులు తెలంగాణకు చేరుకొంటారని అధికారులు అంచనా వేస్తున్నారు.

రెండు నెలలుగా హైద్రాబాద్ లో అంతర్జాతీయ విమానాలు పునరుద్దరించారు.ఈ ఏడాది మార్చిలో కరోనా వైరస్ సమయంలో తీసుకొంటున్నట్టుగానే జాగ్రత్తలు తీసుకొంటున్నామని వైద్య ఆరోగ్యశాఖాధికారులు తెలిపారు.