హైద్రాబాద్‌ అత్తాపూర్‌లో రెండేళ్ల బాలుడిపై వీధి కుక్కల దాడి

హైద్రాబా్ నగరంలోని అత్తాపూర్ లో  ఇంటి ముందు ఆడుకుంటున్న బాలుడిపై  వీధి కుక్కలు దాడి  చేశాయి.

2 year old boy injured in attack by stray dogs in Hyderabad

హైదరాబాద్: నగరంలోని అత్తాపూర్ లో  ఇంటి ముందు  ఆడుకుంటున్న రెండేళ్ల బాలుడిపై  గురువారంనాడు వీధి కుక్కలు దాడి  చేశాయి. ఈ దాడిలో  బాలుడు తీవ్రంగా  గాయపడ్డాడు. గాయపడిన బాలుడిని  కుటుంబ సభ్యులు  చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.హైద్రాబాద్ నగరంలో  వీధి కుక్కల దాడులు  ఇటీవల కాలంలో  ఎక్కువగా  నమోదౌతున్నాయి.  

గత నెలలో  అంబర్ పేటలో  వీధి కుక్కల దాడిలో  నాలుగేళ్ల ప్రదీప్  మృతి చెందాడు.  ఈ ఘటన తర్వాత  వరుసగా  కుక్కల దాడుల ఘటనలు రాష్ట్ర వ్యాప్తంగా  చోటు  చేసుకుంటున్నాయి.  హైద్రాబాద్ లోని  నారాయణగూడలోని ఐపీఎం సెంటర్ కు  పెద్ద ఎత్తున  కుక్క కాటు  బాధితులు  క్యూ కడుతున్నారు. 

హైద్రాబాద్ లో  వీధి కుక్కల నియంత్రణపై  చర్యలకు జీహెచ్ఎంసీ  ప్రత్యేకంగా  చర్యలు చేపట్టింది. హైద్రాబాద్  నగరంలోనే కాదు రాష్ట్ర వ్యాప్తంగా  కూడా  కుక్కల దాడుల ఘటనలు ప్రతి రోజూ నమోదౌతున్నాయి.

అంబర్ పేట  ఘటన  జరిగిన  రెండు  రోజులకే  చైతన్యపురి మారుతినగర్ లో  నాలుగేళ్ల బాలుడిపై   వీధి కుక్కలు దాడి  చేశాయి. కుక్కల దాడిని స్థానికులు  గుర్తించి  వెంటనే  కుక్కలను తరిమివేశారు. రాజేంద్రనగర్  డివిజన్  ఒకే  రోజున ఐదుగురిపై   కుక్కలు దాడి  చేశాయి. ఇవాళ  రాజేంద్రనగర్ నియోజకవర్గం పరిధిలోని అత్తాపూర్ లో ఇవాళ  రెండేళ్ల బాలుడిపై ఆరు కుక్కలు దాడి  చేశాయి . స్థానికులు  కుక్కలను తరిమివేశాయి.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios