హైదరాబాద్ లో ఇంటిముందు క్షుద్రపూజలు.. 16 యేళ్ల బాలిక ఆత్మహత్య..

ఇంటిముందు క్షుద్రపూజలు చేయడంతో అవి చూసిన 16యేళ్ల బాలిక.. తీవ్ర మానసిక ఆందోళనకు లోనై ఆత్మహత్య చేసుకున్న ఘటన హైదరాబాద్ లో కలకలం రేపింది. 

16-year-old girl commits suicide in Hyderabad over occult in front of the house - bsb

హైదరాబాద్ : హైదరాబాద్ కుల్సుంపురాలో 16 యేళ్ల బాలిక ఆత్మహత్య చేసుకోవడం కలకలం సృష్టించింది. క్షుద్ర పూజల వల్లే ఆత్మహత్య చేసుకుందని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. మృతురాలు నవ్య (16)గా గుర్తించారు. గత గురువారం ఆమావాస్య రోజు వారి ఇంటిముందు నిమ్మకాయలు, నల్ల బొమ్మలు పడేశారు. ఆ రోజు వాటిని చూసిన నవ్య తీవ్ర భయాందోళనలకు గురయ్యింది. 

నవ్య చాలా ధైర్యవంతురాలు, చాలా యాక్టివ్ అని.. ఆమె అక్క చెబుతోంది. దేనికీ భయపడదు. కానీ ఆ ఘటన నుంచి చాలా భయానికి గురైందని..ఒక్కతి ఉండడానికి, ఎక్కడికైనా వెళ్లడానికి భయపడుతూ తోడు రమ్మన్నదని అక్క చెబుతోంది. కాస్త చీకటి పడ్డా.. నీడలు కనిపించినా భయపడేదని.. ఆ ఘటనను ఆమె తీవ్రంగా మనసు మీదికి తీసుకుందని తెలిపింది. 

మద్యం మత్తులో చిత్రహింసలు.. తట్టుకోలేక భార్య ఆత్మహత్య, షాక్ అయి పురుగుల మందు తాగి భర్త మృతి...

గత గురువారం ఆమావాస్య రోజు తమ ఇంటిముందు నిమ్మకాయలు, నల్ల బొమ్మలు పడేశారు. వాటిని నవ్యనే ఊడ్చి పారేసింది. ఆ రోజు నుంచి ఆమె అలా ప్రవర్తిస్తుంది. మళ్లీ బుధవారం నాడు కూడా తమింటి వాకింట్లో .. నిమ్మకాయలు, కుంకుమలో ముంచి వేశారు. వాటిని చూసి.. మళ్లీ వేశారని అక్కతో చెప్పింది. పట్టించుకోవద్దని చెప్పానని నవ్య సోదరి తెలిపింది. నవ్యనే వాటిని ఇంటిముందు నుంచి ఊడ్చేసి, కాల్చేసింది.

ఆ తరువాత స్నానం చేసి.. తమతో సరదాగా గడిపింది. అక్క వంట చేయి అంటే.. నేను వంట చేస్తున్నాను. గుడ్లు తెస్తానంటూ తెచ్చిచ్చింది. నేనే ఇంట్లో పైన వంట చేస్తున్నా.. అక్క నేను 5 ని.ల్లో వస్తా అని పైనుంచి కిందికి వచ్చి గదిలో ఆత్మహత్య చేసుకుంది... అని ఆమె అక్క తెలిపింది. వీరు ముగ్గురు అక్కాచెల్లెళ్లు. నవ్య రెండో అమ్మాయి. ఇంటర్ చదువుకుంటోంది. తమ ముగ్గురు అక్కాచెల్లెళ్లలో నవ్య చాలా ధైర్యవంతురాలని, తాను, చిన్నచెల్లె కాస్త సెన్సిటివ్, ఎవ్వరి జోలికీ వెళ్లమని ఆమె చెప్పుకొచ్చింది. 

తన తండ్రి పనికి వెళ్లిన తల్లిని తీసుకువచ్చేసరికే నవ్య ఆత్మహత్య చేసుకుందని తెలిపింది. క్షుద్రపూజలు చేసే తన కూతురిని చంపారని తల్లి రోధించడం అందర్నీ కలిచి వేస్తోంది.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios