15ఏళ్లకే తల్లైన బాలిక....

https://static.asianetnews.com/images/authors/26af83d2-0ed6-5e66-b49b-5078caf01292.jpg
First Published 20, Aug 2018, 11:05 AM IST
15 year old girl delivers baby In karimnagar
Highlights

కరీంనగర్ జిల్లా రామగుండంలో మహిళలపై అఘాయిత్యాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. ఇటీవలే ఒక ఆశ్రమంలో బాలికపై ఆశ్రమ నిర్వాహకుడు చేసిన అత్యాచార ఘటన మరవకముందే మరో దారుణం వెలుగులోకి వచ్చింది. పెళ్లి చేసుకుంటానని నమ్మించి 15 ఏళ్ల బాలికను తల్లిని చేశాడో యువకుడు. 

కరీంనగర్: కరీంనగర్ జిల్లా రామగుండంలో మహిళలపై అఘాయిత్యాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. ఇటీవలే ఒక ఆశ్రమంలో బాలికపై ఆశ్రమ నిర్వాహకుడు చేసిన అత్యాచార ఘటన మరవకముందే మరో దారుణం వెలుగులోకి వచ్చింది. పెళ్లి చేసుకుంటానని నమ్మించి 15 ఏళ్ల బాలికను తల్లిని చేశాడో యువకుడు. 

ఎన్‌టీఆర్‌నగర్‌కు చెందిన బాలిక(15)  గోదావరిఖని ప్రభుత్వ ఆస్పత్రిలో పురుటినొప్పులతో చేరింది. బాలిక మైనర్ కావడంతో ఆస్పత్రి సూపరింటెండెంట్ సూర్యశ్రీ వివరాలు అడిగారు. ఒడిస్సా వలస కూలీ కుటుంబానికి చెందిన వారు సమాధానం చెప్పకపోవడంతో గోదావరిఖని వన్ టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన ఏసీపీ రక్షిత కే మూర్తి విచారణ జరిపారు. యువతి ప్రసవంపై కుటుంబ సభ్యులను ప్రశ్నించగా ఎలాంటి సమాధానం రాకపోవడంతో ఏసీపీ బాలిక కుటుంబ సభ్యులకు కౌన్సిలింంగ్ నిర్వహించి భరోసా కల్పించారు. 

దీంతో  పూర్తి వివరాలు తెలిపారు. ఒడిశాకు చెందిన ప్రతాప్‌ ఠాకూర్‌ అలియాస్ రింకు గోదావరిఖనిలో పని నిమిత్తం వచ్చాడు. బంధువు కావడంతో తమతోపాటే ఉంటున్నాడు. అయితే వరుసకు మేనబావ కావడంతో రింకు బాలికను ప్రేమ పేరుతో లొంగదీసుకున్నా డు. బాలిక గర్భం దాల్చడంతో కుటుంబ సభ్యులు నిలదియ్యగా పెళ్లి చేసుకుంటానని నమ్మించి ఒడిశాకు పరారయ్యాడని తెలిపారు. తమ కుమార్తెకు న్యాయం చెయ్యాలని ఏసీపీకు మెురపెట్టుకున్నారు బాలిక తల్లిదండ్రులు. బాలిక తల్లి ఫిర్యాదుతో  పోలీసులు నిందితుడు ప్రతాప్‌ ఠాకూర్‌పై నిర్భయ, అత్యాచార కేసులను నమోదు చేసినట్లు తెలిపారు. 

ఈ వార్తలు కూడా చదవండి

అనంతలో దారుణం...తొమ్మిదో తరగతి విద్యార్థిని ప్రసవం.

76 ఏళ్ల వయస్సులో చిన్నారులపై లైంగిక వేధింపులు: రాత్రి గదిలో ఇలా...

దారుణం: చెట్టుకు కట్టేసి భార్య కూతురిపై అత్యాచారం

 

loader