విక్రం గౌడ్ కాల్పుల ఘటనపై జవాబు లేని ప్రశ్నలు హత్యాయత్నమా? ఆత్మహత్యా ప్రయత్నామా అన్నది ఇంకా తేలలేదు పోలీసులకు సవాల్ గా మారిన విక్రం కాల్పుల కేసు

విక్రం గౌడ్ కాల్పుల ఘటన హైదరాబాద్ తోపాటు తెలంగాణ, ఆంధ్ర రాష్ట్రాల్లో కలకలం రేపింది. రివాల్వర్ తో రెండు రౌండ్ల కాల్పులు జరిగినట్లు చెబుతున్న ఈ కేసులో అనేక అనుమానాలు నెలకొన్నాయి. ఒక్క మాటలో చెప్పాలంటే ఈ కేసు మిస్టరీగా మారుతున్నది. అనేక అనుమానాలు కలుగుతున్న విక్రం గౌడ్ కేసును పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. ఈ ప్రశ్నలకు బదులు దొరికితే కేసును చేధించేందుకు పోలీసుల పని సులువవుతుంది. విక్రం ప్రస్తుతం ఐసియులో చికిత్స పొందుతున్నాడు. 

1 విక్రం గౌడ్ అర్థరాత్రి ఎందుకు బయట తిరుగుతున్నాడు?

2 అన్నదానం కార్యక్రమం దర్గాలో ఉందా? లేక పెద్దమ్మ గుడిలో చేస్తున్నారా?

3 అన్నదానం చేయాలంటే మూడున్నరకు లేచి వెళ్లాల్సిన అవసరం ఏముంది?

4 అన్నదానం చేయాలన్న ఆలోచన అసలు ఎందుకొచ్చింది? ఉద్దేశం ఏమిటి?

5 కాల్పుల తర్వాత విక్రం ను ఆసుపత్రికి తీసుకువెళ్లిన వారు ఎవరు?

6 అన్నదానం దర్గాలో అని, తర్వాత పెద్దమ్మ గుడి అని మాట మార్చారు ఎందుకు?

7 ఇంటివద్ద ఉన్న సిసి కెమెరాలు పనిచేయకపోవడం ఎందుకు?

8 విక్రం గౌడ్ ను కాల్చిన తుపాకీ ఎక్కడుంది?

9 డ్రగ్స్ కేసు కథనాలను విక్రం సెల్ ఫోన్ లో ఎందుకు సేవ్ చేశాడు.?

10 పోలీసులు కోరినా ఫిర్యాదు చేసేందుకు షిపాలి ఎందుకు తటపటాయించారు?

11 బయటివాళ్లు కాల్పులు జరిపారని షిపాలి చెప్పడం ఉద్దేశపూర్వకమా? తెలియక చెప్పినట్లా?

12 కాల్పుల ఘటనపై మాజీ మంత్రి ముఖేష్ గౌడ్ ఎందుకు స్పందించలేదు?

13 పార్టీ మేయర్ అభ్యర్థి అయిన విక్రం గౌడ్ కాల్పులపై కాంగ్రెస్ ఎందుకు మౌనం వహిస్తున్నది?

14 పార్టీ నేతలెవరూ పరామర్శించకపోవడం వెనుక కారణమేమిటి?

15 అప్పుల తీర్చాలంటూ వెంటపడుతున్న 35 మంది ఎవరు?