సిటీ కమిషనర్ మహేందర్ రెడ్డి ప్రకటన
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ సచివాలయం పరిసర ప్రాంతాల్లో ఇక పై 144 సెక్షన్ విధిస్తున్నట్లు హైదరాబాద్ సిటీ పోలీస్ కమిషనర్ ఎం. మహేందర్ రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు.
నగరంలోని శాంతిభద్రతలను అదుపులో ఉంచేందుకు, సున్నితమైన సచివాలయం వంటి ప్రాంతాలలో పరిస్థితి అదుపుతప్పకుండా ఉండేందుకు ఈ చర్యలు తీసుకున్నట్లు వెల్లడించారు.
సైఫాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఉన్న సచివాలయం పరిసర ప్రాంతాలలోసిటీ పోలీస్ కమిషన్ నిబంధనలోని ప్రకారం 144 సెక్షన్ అమల్లో ఉంటుందని తెలిపారు.
