తెలంగాణలో పెరుగుతున్న ఒమిక్రాన్ కేసులు.. కొత్తగా 12 మందికి పాజిటివ్, 79కి చేరిన సంఖ్య

తెలంగాణలో (telangana) కరోనా కొత్త వేరియంట్‌ ఒమిక్రాన్‌ (omicron) కేసులు క్రమక్రమంగా పెరుగుతున్నాయి. గడిచిన 24 గంటల వ్యవధిలో రాష్ట్రంలో కొత్తగా మరో 12 ఒమిక్రాన్‌ కేసులు వెలుగుచూశాయి. వీటితో కలిపి రాష్ట్రంలో ఇప్పటివరకు నమోదైన మొత్తం కేసుల సంఖ్య 79కి చేరింది

12 new omicron cases reported in telangana

తెలంగాణలో (telangana) కరోనా కొత్త వేరియంట్‌ ఒమిక్రాన్‌ (omicron) కేసులు క్రమక్రమంగా పెరుగుతున్నాయి. గడిచిన 24 గంటల వ్యవధిలో రాష్ట్రంలో కొత్తగా మరో 12 ఒమిక్రాన్‌ కేసులు వెలుగుచూశాయి. వీటితో కలిపి రాష్ట్రంలో ఇప్పటివరకు నమోదైన మొత్తం కేసుల సంఖ్య 79కి చేరింది. 24 గంటల వ్యవధిలో ఎట్‌ రిస్క్‌ దేశాల నుంచి 123 మంది శంషాబాద్‌ విమానాశ్రయానికి (ఆర్‌జీఐఏ) చేరుకున్నారు. వారందరికీ కొవిడ్‌ ఆర్‌టీ-పీసీఆర్‌ టెస్టులు చేయగా 10 మందికి పాజిటివ్‌గా తేలింది. దీంతో వారి నమూనాలను జీనోమ్‌ సీక్వెన్సింగ్‌కి పంపించారు.  

ఇప్పటివరకు ఎట్‌ రిస్క్‌, నాన్‌ రిస్క్‌ దేశాల నుంచి వచ్చిన 12,692 మంది ప్రయాణికులకు శంషాబాద్ విమానాశ్రయంలో (shamshabad airport) కొవిడ్ ఆర్‌టీ-పీసీఆర్‌ పరీక్షలు చేశారు. వారిలో 144 మందికి కొవిడ్‌ పాజిటివ్‌ నిర్ధారణ అయింది. వారందరి శాంపిల్స్‌ని అధికారులు జీనోమ్‌ సీక్వెన్సింగ్‌కి పంపించారు. వారిలో 44 మందికి ఒమిక్రాన్‌ నెగెటివ్‌గా తేలింది. మిగిలిన 100 మందిలో ఇప్పటివరకు 79 మందికి పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. మరో 21 మంది ఫలితాలు రావాల్సి ఉంది.

Also Read:కేసులు పెరుగుతున్నాయ్.. తాత్కాలిక హాస్పిటళ్లు ఏర్పాటు చేయండి.. పిల్లల కేసులపై ఫోకస్ పెట్టండి: కేంద్రం సూచనలు

తెలంగాణలో గడిచిన 24 గంటల్లో 28,886 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా.. కొత్తగా 317 పాజిటివ్‌ కేసులు నమోదైనట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ ప్రకటించింది. వీటితో కలిపి ఇప్పటివరకు తెలంగాణలో కరోనా బారినపడిన వారి సంఖ్య 6,82,215కి చేరింది. గత 24 గంటల వ్యవధిలో రాష్ట్రంలో కరోనాతో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. వీరితో కలిపి ఇప్పటివరకు రాష్ట్రంలో కోవిడ్ వల్ల మరణించిన వారి సంఖ్య 4,029కు చేరింది. కరోనా బారి నుంచి నిన్న 232 మంది కోలుకున్నారు. ప్రస్తుతం తెలంగాణలో 3,733 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios