Asianet News TeluguAsianet News Telugu

వికారాబాద్ : నోటి వెంట రక్తం, పిచ్చి ప్రవర్తన.. పెరుగుతున్న కల్లు బాధితులు

వికారాబాద్ జిల్లాలో కల్తీ కల్లు బాధితుల సంఖ్య పెరుగుతోంది. ఇవాళ పలువురు తీవ్ర అస్వస్థతకు గురికావడంతో ఆసుపత్రికి తరలించారు. నోట్లో నుంచి రక్తం వస్తుండటంతో ఆందోళన చెందుతున్నారు. 

1 dead, 183 hospitalised after consuming adulterated toddy in Vikarabad ksp
Author
Vikarabad, First Published Jan 10, 2021, 5:17 PM IST

వికారాబాద్ జిల్లాలో కల్తీ కల్లు బాధితుల సంఖ్య పెరుగుతోంది. ఇవాళ పలువురు తీవ్ర అస్వస్థతకు గురికావడంతో ఆసుపత్రికి తరలించారు. నోట్లో నుంచి రక్తం వస్తుండటంతో ఆందోళన చెందుతున్నారు.

వీరిలో విషమంగా వున్న వారిని హైదరాబాద్‌కు తరలించారు. ఇప్పటికే వికారాబాద్‌లోని నాలుగు ఆసుపత్రుల్లో బాధితులకు చికిత్స అందిస్తున్నారు. బెడ్స్ లేకపోవడంతో కొందరిని పరిగి ప్రభుత్వాసుపత్రికి తరలించారు.

Also Read:వికారాబాద్ కల్తీకల్లు ఘటన: తెలంగాణ సర్కార్ సీరియస్

మరోవైపు వికారాబాద్ కల్తీ కల్లు ఘటనపై తెలంగాణ ప్రభుత్వం సీరియస్ అయ్యింది. ఘటనపై పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఇప్పటి వరకు 183 మంది అస్వస్థతకు గురికాగా, ఒకరు మృతి చెందారు.

కల్లు సంఘాల మధ్య విభేదాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు. ఈ ఘటనలో కుట్ర కోణంపై దర్యాప్తు చేస్తున్నారు. ఇప్పటికే చిట్టిగిద్ద కల్లు డిపోను సీజ్ చేసిన ఎక్సైజ్ శాఖ లోతుగా దర్యాప్తు చేస్తోంది.

వికారాబాద్ నియోజకవర్గంలో కల్లు డిపోలు బంద్ చేశారు. మరోవైపు వికారాబాద్‌లో కల్తీ కల్లు బాధితుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. ఆసుపత్రుల్లో 183 మంది చికిత్స పొందుతున్నారు. కల్తీ కల్లు తాగడంతో బాధితుల్లో ఫిట్స్ లక్షణాలు కనిపిస్తున్నాయి. పిచ్చిపిచ్చిగా ప్రవర్తిస్తున్నారు మరికొందరు. 
 

Follow Us:
Download App:
  • android
  • ios