హైదరాబాద్: వికారాబాద్ జిల్లాలో కల్తీకల్లు ఘటనను తెలంగాణ ప్రభుత్వం సీరియస్ గా తీసుకొంది. ఈ ఘటన వెనుక ఏమైనా కుట్ర దాగి ఉందా అనే కోణంలో కూడ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

కల్లు సంఘాల మధ్య విభేదాలు ఈ ఘటనకు ఏమైనా కారణంగా మారాయా అనే కోణంలో కూడ పోలీసులు ఆరా తీస్తున్నారు.  వికారాబాద్ జిల్లాలోని చిట్టిగిద్ద కలు డిపోను సీజ్ చేశారు. జిల్లాలోని కల్లు డిపోలన్నీ బంద్ చేశారు. కల్తీ కల్లు ఘటనకు కారణాలపై ఎక్సైజ్ శాఖ అధికారులు ఆరా తీస్తున్నారు.

also read:వికారాబాద్ జిల్లాలో కల్తీకల్లుకు ఇద్దరు బలి: 200 మందికి అస్వస్థత

శనివారం నుండి  కల్తీకల్లు తాగి అస్వస్థతకు గురైన బాధితుల సంఖ్య పెరుగుతూ వస్తోంది.ఈ ఘటనపై ఎక్సైజ్ శాఖతో పాటు పోలీసులు కూడా లోతుగా దర్యాప్తు చేస్తున్నారు.