హైదరాబాద్ లో తాగు నీటి సమస్య లేకుండా చేశాం - మంత్రి కేటీఆర్
హైదరాబాద్ మెట్రోను వచ్చే పది సంవత్సరాల్లో 415 కిలో మీటర్లకు విస్తరించాలని తాము ఎజెండాగా పెట్టుకున్నామని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ అన్నారు. అలాగే 24 గంటల పాటు హైదరాబాద్ లో 24 గంటల పాటు తాగు నీటిని అందించాలని అనుకుంటున్నామని తెలిపారు.
KTR : మిషన్ భగీరథ పథకం ద్వారా హైదరాబాద్ లో తాగు నీటి సమస్య లేకుండా చేశామని తెలంగాణ ఐటీ, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. నిరంతరాయంగా కరెంట్ సరఫరా చేస్తున్నది తెలంగాణ రాష్ట్రం మాత్రమే అని చెప్పారు. హైదరాబాద్ లో శనివారం నిర్వహించిన రెసిడెంట్ వెల్ఫేర్ అసోసియేషన్ ల ప్రతినిధుల సమావేశానికి ఆయన హాజరై ప్రసంగించారు.
Rahul Gandhi : ప్రజా కేంద్రీకృత పాలనను తీసుకురావాల్సిన సమయం ఆసన్నమైంది - రాహుల్ గాంధీ
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో తాగునీటి, కరెంట్ సమస్యలు తీవ్రంగా ఉండేవని మంత్రి కేటీఆర్ అన్నారు. ఆ సమయంలో ఈ తెలంగాణ ప్రాంతంలో కరెంట్ కోతలు తరచుగా ఉండేవని అన్నారు. తాగు నీటి ఇబ్బందులు కూడా ఉండేవని చెప్పారు. వాటి కోసం నిరసనలు జరిగేవని మంత్రి గుర్తు చేశారు. అందుకే తాము అధికారంలోకి వచ్చిన తరువాత ఈ సమస్యలపై ఫొకస్ పెట్టామని అన్నారు. హైదరాబాద్ లో మిషన్ భగీరథ పథకం ద్వారా తాగు నీటి సమస్యను పరిష్కరించామని మంత్రి తెలిపారు.
UCC : ఉత్తరాఖండ్ లో అమల్లోకి రానున్న యూనిఫాం సివిల్ కోడ్.. ఎప్పటి నుంచి అంటే..
అలాగే కరెంటు సమస్యను కూడా పరిష్కరించామని చెప్పారు. ఇప్పుడు దేశంలో కరెంటును నిరంతరాయంగా అందిస్తున్న రాష్ట్రం ఒక్క తెలంగాణనే అని స్పష్టం చేశారు. తెలంగాణ రాజధానిలో ప్రజా రవాణాను కాలుష్య రహితంగా అందించాలని తాము లక్ష్యంగా పెట్టుకున్నామని చెప్పారు. భాగ్యనగరంలో 24 గంటల పాటు తాగు నీటిని అందించడం తమ స్వప్నం అని మంత్రి తెలిపారు. దీంతో పాటు మెట్రో ను వచ్చే పది సంవత్సరాల్లో 415 కిలో మీటర్లకు విస్తరించాలని తాము ఎజెండాగా పెట్టుకున్నామని చెప్పారు.