Asianet News TeluguAsianet News Telugu

బీజేపీ నేతలను చెప్పుతో కొడతా.. : తుల ఉమ

బీజేపీ నేత తుల ఉమ పార్టీని వీడనున్నారు. టికెట్ ఇస్తానని చెప్పి చివరి నిమిషంలో వికాస్ రావుకు బీఫాం ఇవ్వడంపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. 

Vemulwada bjp leader Tula Uma going to leave party - bsb
Author
First Published Nov 11, 2023, 12:27 PM IST | Last Updated Nov 11, 2023, 12:27 PM IST

వేములవాడ : తెలంగాణ బీజేపీలో సీట్ల కేటాయింపు తీవ్ర నిరసనలకు దారి తీస్తోంది. వేములవాడ నుంచి తుల ఉమకు బీఫాం చివరినిమిషంలో దక్కకపోవడంతో ఆమె తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బీజేపీని వీడే యోచనలో ఉన్నారు. కరీంనగర్ బీజేపీ నేతలు ఏ ముఖం పెట్టుకుని తనకు ఫోన్ చేస్తారని.. వారికి అంత ధైర్యం, దమ్ము లేదన్నారు. వారు తన దగ్గరికి వస్తే చెప్పుతో కొడతానని ఘాటుగా స్పందించారు. 

తనకు ఫోన్ చేయాలంటే సిగ్గు పడతారు కదా.. టికెట్ ఇస్తామని ఒక బీసీని, మహిళను మోసం చేసినందుకు మొహం ఎక్కడ పెట్టుకుంటారని అన్నారు. తుల ఉమ ఇప్పటికే కాంగ్రెస్, బిఆర్ఎస్ నేతలతో సంప్రదింపులు జరుపుతున్నారు. తన అనుచరులతో సమావేశం కానున్నారు. 

బిజెపి కుటుంబ పాలనకు వ్యతిరేకమని చెబుతుందని.. కానీ అదంతా బూటకమని అన్నారు. బీజేపీలో మహిళలకు స్థానం లేదు. నమ్మించి మోసం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. బండి సంజయ్ దొరల దగ్గర ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టారన్నారు. బీసీని పక్కన పెట్టి దొరలకు బీఫాం ఇచ్చారన్నారు. బిజెపిలో సిద్ధాంతాలు లేవని, బీసీ ముఖ్యమంత్రి అనేది బూటకం అని.. కావాలనే తన మీద తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని మండిపడ్డారు. 
 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios