Asianet News TeluguAsianet News Telugu

Harish Rao: జై తెలంగాణ అంటే షూట్ చేయాలని రేవంత్ రెడ్డి బెదిరించాడు: గజ్వేల్‌లో మంత్రి హరీశ్ రావు

మంత్రి హరీశ్ ఈ రోజు గజ్వేల్‌లో మాట్లాడుతూ.. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిపై సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ ఉద్యమం ఉచ్ఛ స్థాయిలో ఉన్నప్పుడు జై తెలంగాణ అనే నినాదం ఇస్తే షూట్ చేయాలని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అన్నారని చెప్పారు.
 

tpcc chief revanth reddy threaten to shoot those who sloganed jai telangana in the movement says minister harish rao kms
Author
First Published Nov 20, 2023, 10:18 PM IST

హైదరాబాద్: ఆర్థిక మంత్రి హరీశ్ రావు ఈ రోజు ములుగులో ప్రసంగిస్తూ కీలక వ్యాఖ్యలు చేశారు. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిపైనా ఘాటైన విమర్శలు చేశారు. తెలంగాణ ఉద్యమ ఉచ్ఛస్థాయిలో ఉన్న కాలంలో జై తెలంగాణ అని నినదిస్తూ షూట్ చేయాలని రేవంత్ రెడ్డి బెదిరించాడని తెలిపారు.

గజ్వేల్ నియోజకవర్గంలోని ములుగులో సోమవారం మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్ర ఉద్యమ పార్టీ బీఆర్ఎస్ కాకుండా వేరే ఏ పార్టీ గెలిచినా సురక్షితంగానే ఉంటదా? ప్రజలు ఆలోచించుకోవాలని అన్నారు. కాంగ్రెస్‌లో ఐక్యతే లేదని, వారు ఒకరిపై ఒకరు పోట్లాడుతుంటారని వివరించారు. ఆ పార్టీ అభివృద్ధి దృష్టి పెట్టదని అన్నారు.

ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం సీఎం కేసీఆర్ నిరాహార దీక్ష చేశాడని మంత్రి హరీశ్ రావు గుర్తు చేశారు. తండ్రి వంటి కేసీఆర్ చేతిలోనే తెలంగాన భవితవ్యం సురక్షితంగా ఉంటుందని తెలిపారు. అలాగే.. వయోవృద్ధులు ఈ సారి ఓటు వేసేటప్పుడు ఎన్నికల గుర్తులను చూసి గందరగోళ పడవద్దని అన్నారు. కారు గుర్తుతో పోలి ఉన్న ఇతర గుర్తులు ఉండొచ్చని, కానీ, కన్ఫ్యూజ్ కావొద్దని సూచించారు.

Also Read: Kamareddy: కామారెడ్డికి ఆర్టీసీ బస్సులో వెళ్లుతున్న సిరిసిల్ల వ్యక్తి వద్ద రూ. 25 లక్షలు సీజ్

మల్లన్న సాగర్, కొండపోచమ్మ సాగర్ కోసం విస్తాపితులైన వారికి అన్ని రకాల సహాయాన్ని బీఆర్ఎస్ అందిస్తుందని మంత్రి హరీశ్ రావు తెలిపారు. ఈ ఎన్నికల్లో గెలిచిన తర్వాత బీఆర్ఎస్ ప్రభుత్వం మరింత ఉపాధిని కల్పిస్తుందని వివరించారు. ప్రత్యర్థ పార్టీలు ప్రచారం చేసే అవాస్తవాలను నమ్మొద్దని కోరారు.

Follow Us:
Download App:
  • android
  • ios