Asianet News TeluguAsianet News Telugu

Rythu Bandhu: రైతు బంధు ఈ నెలలో లేనట్టే?.. కేసీఆర్ చెప్పిన డేట్ ఇదే

రైతు బంధు నిధులు ఈ నెలలో పడేలా లేవు. ఈ నెలలో అంటే ఎన్నికలకు ముందు రైతు బంధు నిధులు పడాలంటే మంగళవారం మాత్రమే సాధ్యం అవుతుంది. కానీ, ఇప్పటికైతే ఎన్నికల సంఘం నుంచి బీఆర్ఎస్ విజ్ఞప్తిపై సానుకూల స్పందన రాలేదు. దీంతో వచ్చే నెల ఫలితాలు వెలువడ్డాక కొత్త ప్రభుత్వ ఏర్పాటు చేసిన తర్వాత ఈ నిధులు రైతుల ఖాతాల్లో పడుతాయని అంచనా వేస్తున్నారు.
 

this month may not be release rythu bandhu scheme funds, cm kcr fixed a date next month kms
Author
First Published Nov 27, 2023, 6:49 PM IST

హైదరాబాద్: రైతు బంధు పథకం కింద రైతులకు పెట్టుబడి సహాయం అందించడంపై సంశయాలు నెలకొన్నాయి. ఓ సారి నిధుల పంపిణీకి అనుమతి ఇచ్చిన ఎన్నికల సంఘం మళ్లీ వాటిని వెనక్కి తీసుకుంది. దీంతో మరోసారి బీఆర్ఎస్, కాంగ్రెస్‌లు ఆరోపణలు, ప్రత్యారోపణలు చేసుకుంటున్నాయి. రైతు బంధు నిధుల పంపిణీ అనుమతులను వెనక్కి తీసుకోవడంతో భారత రాష్ట్ర సమితి ఎన్నికల సంఘానికి విజ్ఞప్తి చేసింది. రైతు బంధు ఆపాలన్న నిర్ణయాన్ని పునరాలోచించాలని ఓ మెమోరాండాన్ని ఇచ్చింది.

వరుసగా సోమవారం వరకు బ్యాంకులకు సెలవులే ఉన్నాయి. రేపు ఒక్క రోజు మినహాయిస్తే.. 29, 30 తేదీల్లో ఎన్నికల కోడ్  కారణంగా రైతు బంధు పడే అవకాశాలే లేవు. డిసెంబర్ 3వ తేదీ వరకు ఈ వీలు లేదు. కానీ, ఆ తర్వాత మెజార్టీ వచ్చిన పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే వరకు రైతు బంధు నిధులు పడవు. బీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడితే 6వ తేదీన రైతు బంధు నిధులను విడుదల చేస్తామని సీఎం కేసీఆర్ చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడితే ఆ పార్టీ పథకాన్ని అమలు చేస్తుంది.

సీఈవో వికాస్ రాజ్‌కు మెమోరాండం ఇస్తూ బీఆర్ఎస్ ఎంపీ కేశవరావు కీలక వ్యాఖ్యలు చేశారు. కేంద్ర ఎన్నికల సంఘంతోనూ మాట్లాడి రేపు రైతు బంధు నిధుల పడటానికి అనుమతులు వచ్చే ప్రయత్నాలు చేస్తామని చెప్పారు. ఇప్పటికిప్పుడు కోర్టుకు వెళ్లే సమయం లేదని, కాబట్టి, ఒక వేళ కేంద్ర ఎన్నికల సంఘం నుంచి సానుకూల స్పందన రాకుంటే రైతులు ఈ పరిస్థితులు ఆలోచించి ఓపిక పట్టాలని కోరారు.

Also Read : Rapido: ర్యాపిడో బంపర్ ఆఫర్.. ఓటు వేయడానికి ఫ్రీ రైడ్.. వివరాలివే

ఇక సీఎం కేసీఆర్ కూడా రైతు బంధు నిధుల పంపిణీ పై ఆందోల్‌లో నిర్వహించిన సభలో స్పందించారు. డిసెంబర్ 3వ తేదీన బీఆర్ఎస్ పార్టీనే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని, 6వ తేదీన రైతు బంధు నిధులు రైతుల ఖాతాల్లో వేస్తామని హామీ ఇచ్చారు.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios