chittem ram mohan reddy.. వర్కూర్‌లో దాడికి కాంగ్రెస్ శ్రేణుల యత్నం: బీఆర్ఎస్, కాంగ్రెస్ శ్రేణుల మధ్య ఘర్షణ
మక్తల్ అసెంబ్లీ నియోజకవర్గంలోని వర్కూర్ లో కాంగ్రెస్, బీఆర్ఎస్ వర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. దీంతో ఉద్రిక్తత చోటు చేసుకుంది.
నారాయణపేట: నారాయణపేట జిల్లాలోని మక్తల్ అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలోని వర్కూర్ లో కాంగ్రెస్, బీఆర్ఎస్ వర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. వర్కూర్ పోలింగ్ బూత్ వద్ద మక్తల్ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్ రెడ్డిపై దాడికి కాంగ్రెస్ వర్గాలు ప్రయత్నించాయి. ఈ సమయంలో పోలీసులు ఇరు వర్గాలను నిలువరించే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి అక్కడి నుండి బయటపడ్డారు.
మక్తల్ నియోజకవర్గంలోని వర్కూర్ లో బీఆర్ఎస్, కాంగ్రెస్ వర్గాల మధ్య ఘర్షణ నెలకొంది. మక్తల్ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్ రెడ్డితో పాటు ఆయన వర్గీయులు పోలింగ్ బూత్ లోకి వెళ్లేందుకు యత్నించారని కాంగ్రెస్ ఆరోపిస్తుంది.దీంతో ఎమ్మెల్యేను అడ్డుకొనే ప్రయత్నించినట్టుగా ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఈ క్రమంలోనే ఇరు వర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది.
2014, 2018 అసెంబ్లీ ఎన్నికల్లో మక్తల్ అసెంబ్లీ స్థానం నుండి చిట్టెం రామ్మోహన్ రెడ్డి ప్రాతినిథ్యం వహిస్తున్నారు. ఈ దఫా చిట్టెం రామ్మోహన్ రెడ్డి బీఆర్ఎస్ అభ్యర్ధిగా బరిలోకి దిగారు. 2014 ఎన్నికల సమయంలో చిట్టెం రామ్మోహన్ రెడ్డి కాంగ్రెస్ అభ్యర్ధిగా విజయం సాధించారు. అయితే చిట్టెం రామ్మోహన్ రెడ్డి కాంగ్రెస్ నుండి బీఆర్ఎస్ లో చేరారు. బీజేపీ నేత, మాజీ మంత్రి డీకే అరుణకు చిట్టెం రామ్మోహన్ రెడ్డి స్వయానా సోదరుడు.
మక్తల్ నుండి గతంలో రామ్మోహన్ రెడ్డి తండ్రి చిట్టెం నర్సిరెడ్డి ప్రాతినిథ్యం వహించిన విషయం తెలిసిందే. ఇవాళ వర్కూర్ లో తన అనుచరులతో ఎమ్మెల్యే చిట్టెం నర్సిరెడ్డి రావడంతో ఈ ఘటన చోటు చేసుకుంది.
also read:Kalvakuntla chandrashekar Rao:చింతమడకలో ఓటేసిన కేసీఆర్ దంపతులు
రాష్ట్రంలో మూడో దఫా అధికారంలోకి రావడం కోసం బీఆర్ఎస్ నాయకత్వం అస్త్రశస్త్రాలను సంధించింది. కాంగ్రెస్, బీజేపీలు కూడ రాష్ట్రంలో అధికారాన్ని కైవసం చేసుకొనేందుకు ప్రయత్నాలు చేసిన విషయం తెలిసిందే.