మైనార్టీలను బీసీల్లో చేర్చే ప్రతిపాదన: కాంగ్రెస్ డిక్లరేషన్‌పై కేటీఆర్ ఫైర్
కాంగ్రెస్ విడుదల చేసిన మైనార్టీ డిక్లరేషన్ పై భారత రాష్ట్ర సమితి విమర్శలు చేస్తుంది.
హైదరాబాద్: మైనార్టీలను బీసీల్లో చేర్చుతామని కాంగ్రెస్ పార్టీ ప్రకటించడాన్ని తాము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్టుగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ ప్రకటించారు.శుక్రవారంనాడు హైద్రాబాద్ లోని భారత రాష్ట్ర సమితి కార్యాలయంలో కల్వకుంట్ల తారక రామారావు(కేటీఆర్) మీడియాతో మాట్లాడారు.
నిన్న కాంగ్రెస్ పార్టీ విడుదల చేసిన మైనార్టీ డిక్లరేషన్ పై కల్వకుంట్ల తారకరామారావు విమర్శలు గుప్పించారు.ముస్లింలను బీసీలుగా గుర్తిస్తామని మైనార్టీ డిక్లరేషన్ లో కాంగ్రెస్ హామీ ఇచ్చిన విషయాన్ని ప్రస్తావించారు.ఈ ప్రతిపాదన మైనార్టీలు, బీసీలకు నష్టం చేస్తుందని కల్వకుంట్ల తారక రామారావు అభిప్రాయపడ్డారు. కాంగ్రెస్ పార్టీ మైనార్టీ డిక్లరేషన్ ను చూస్తే బీజేపీ సిద్దాంతాలకు అనుగుణంగా ఉందని కేటీఆర్ ఆరోపించారు.
మైనార్టీలకు కులగణన అవసరం దన్నారు. ఈ ప్రతిపాదనను వెంటనే విరమించుకోవాలని ఆయన కోరారు.
ముస్లింలు, క్రైస్తవులు, సిక్కులు, రాజ్యాంగపరంగా మతపరమైన మైనార్టీలన్నారు. బీసీలకు, మైనార్టీలకు తగాదా పెట్టాలని కాంగ్రెస్ భావిస్తుందని కేటీఆర్ ఆరోపించారు.బీసీల్లో మైనార్టీలను చేర్చితే సంక్షేమ పథకాలు ఆగిపోతాయన్నారు. 2004-14 మధ్య మైనార్టీ సంక్షేమానికి కాంగ్రెస్ పార్టీ రూ. 930 కోట్లు ఖర్చు చేసిందని కేటీఆర్ చెప్పారు. కానీ తమ పాలనలో బీఆర్ఎస్ మైనార్టీల కోసం రూ. 10 వేల కోట్లు ఖర్చు చేసిందని కేటీఆర్ వివరించారు.
ప్రశాంతంగా ఉన్న తెలంగాణలో బీసీలకు మైనార్టీల మధ్య గొడవ పెట్టేందుకు గాను మైనార్టీ డిక్లరేషన్ ఉందని ఆయన ఆరోపించారు. మైనార్టీలను బీసీల్లో చేర్చుతామనే ప్రతిపాదనను వెనక్కు తీసుకోవాలని కేటీఆర్ డిమాండ్ చేశారు.