Telangana Exit Polls - AARAA PRE POLL SURVEY : కాంగ్రెస్‌దే అధికారం.. బీజేపీ కంటే ఇతరులే నయం
AARAA PRE POLL SURVEY ప్రకారం తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని తేలింది. కాంగ్రెస్‌కు 41.13 శాతం ఓట్లు, బీఆర్ఎస్‌కు 39.58 శాతం ఓట్లు, బీజేపీకి 10.47 శాతం ఓట్లు, ఇతరులు 8.82 శాతం ఓట్లు కైవసం చేసుకుంటారని తెలిపింది.
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ చెదురుమదురు ఘటనలు మినహా ప్రశాంతంగా ముగిసింది. సాయంత్రం 5 గంటల వరకు క్యూలైన్‌లలో వున్న ఓటర్లకు ఎన్నికల సంఘం ఓటు వేసే అవకాశం కల్పించింది. రాష్ట్రంలోని 119 అసెంబ్లీ స్థానాలకు గాను 2,290 మంది అభ్యర్ధులు తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. మొత్తం 3.26 కోట్ల మంది ఓటర్లు అభ్యర్ధుల భవితవ్యాన్ని తేల్చనున్నారు. రాష్ట్రంలో పురుషులతో పోలిస్తే మహిళా ఓటర్లే ఎక్కువగా వున్నారు. దాదాపు 68 నియోజకవర్గాల్లో అభ్యర్ధుల గెలుపు, ఓటములను వారే శాసించనున్నారు.
AARAA PRE POLL SURVEY ప్రకారం తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని తేలింది. కాంగ్రెస్‌కు 41.13 శాతం ఓట్లు, బీఆర్ఎస్‌కు 39.58 శాతం ఓట్లు, బీజేపీకి 10.47 శాతం ఓట్లు, ఇతరులు 8.82 శాతం ఓట్లు కైవసం చేసుకుంటారని తెలిపింది.
ఆరా సంస్థ సర్వే ఫలితాలు :
బీఆర్ఎస్ - 41 నుంచి 49 స్థానాలు
కాంగ్రెస్ - 58 నుంచి 63 స్థానాలు
బీజేపీ - 5 నుంచి 7 స్థానాలు
ఇతరులు - 7 నుంచి 9 స్థానాలు