Asianet News TeluguAsianet News Telugu

Telangana Election Results 2023:తెలంగాణ సీఈఓ వికాస్‌రాజ్‌తో కాంగ్రెస్ బృందం భేటి, కేసీఆర్‌ఫై ఫిర్యాదు

ఈ నెల  4వ తేదీన తెలంగాణ రాష్ట్ర కేబినెట్ సమావేశం, నిధుల మళ్లింపు,భూముల రిజిస్ట్రేషన్ అంశాలపై  తెలంగాణ రాష్ట్ర ఎన్నికల అధికారికి  కాంగ్రెస్ ఫిర్యాదు చేసింది.  ఈ విషయమై  ఇవాళ తెలంగాణ ఎన్నికల ప్రధానాధికారితో  రేవంత్ రెడ్డి నేతృత్వంలో కాంగ్రెస్ బృందం భేటీ అయింది. 

 Telangana Election Results 2023:Revanth Reddy Meets Telangana chief Election officer  Vikas Raj lns
Author
First Published Dec 2, 2023, 12:59 PM IST

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి  వికాస్ రాజ్ తో తెలంగాణ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, మాజీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి, పార్టీ నేతలు మధు యాష్కీ,  పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిలు  శనివారంనాడు  భేటీ అయ్యారు. 

ఈ నెల  4వ తేదీన తెలంగాణ సీఎం కేసీఆర్ కేబినెట్ సమావేశం  ఏర్పాటు చేశారు.ఈ కేబినెట్ సమావేశంపై కాంగ్రెస్ నేతలు ఫిర్యాదు చేయనున్నారు. మరోవైపు ధరణి పోర్టల్ ద్వారా  భూముల రిజిస్ట్రేషన్లను చేసేందుకు  తెలంగాణ సర్కార్ ప్రయత్నాలు చేస్తుందని  కాంగ్రెస్  ఆరోపించింది. ఈ విషయమై  కాంగ్రెస్ నేతలు  తెలంగాణ ఎన్నికల ప్రధానాధికారి వికాస్ రాజ్ కు ఫిర్యాదు చేశారు.

ఈ నెల  3వ తేదీన తెలంగాణ ఎన్నికల కౌంటింగ్  జరుగుతుంది.అయితే ఈ నెల  4వ తేదీన కేసీఆర్ కేబినెట్ సమావేశం ఏర్పాటు చేశారు.ఈ కేబినెట్ సమావేశం పై  రేవంత్ రెడ్డి బృందం  వికాస్ రాజ్ కు ఫిర్యాదు చేసింది. పలు బిల్లులకు సంబంధించి కాంట్రాక్టర్లకు  కేసీఆర్ సర్కార్ బిల్లులను చెల్లిస్తుందని  కాంగ్రెస్ నేతలు ఆరోపించారు. మరో వైపు ధరణి పోర్టల్ ను అడ్డు పెట్టుకొని అసైన్డ్ భూములను  ఇష్టారీతిలో  రిజిస్ట్రేషన్లు జరుగుతున్నాయని  నిన్న సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క, ఆ పార్టీ నేత మధు యాష్కీలు ఆరోపణలు చేశారు.ఈ విషయమై  చర్యలు తీసుకోవాలని  తెలంగాణ ఎన్నికల ప్రధానాధికారిని  కోరారు కాంగ్రెస్ నేతలు.

తెలంగాణ ఎన్నికల ప్రధానాధికారి వికాస్ రాజ్ తో  భేటీ తర్వాత తెలంగాణ పీసీసీ  మాజీ అధ్యక్షుడు  ఉత్తమ్ కుమార్ రెడ్డి మీడియాతో మాట్లాడారు.తమకు నచ్చిన  కాంట్రాక్టర్లకు  కేసీఆర్ సర్కార్  రూ. 6 వేల కోట్ల నిధులను కట్టబెట్టే ప్రయత్నం చేస్తుందని  ఆయన ఆరోపించారు.అసైన్డ్ భూముల రికార్డులు మార్చేందుకు ప్రయత్నిస్తున్నారని ఆయన  చెప్పారు.

ఈ ప్రభుత్వం ఎలాంటి నిర్ణయాలు తీసుకోకూడదన్నారు. కేసీఆర్ సర్కార్ ఎలాంటి నిర్ణయాలు తీసుకోకుండా చూడాలని తెలంగాణ ఎన్నికల ప్రధానాధికారిని కోరినట్టుగా ఉత్తమ్ కుమార్ రెడ్డి  చెప్పారు. కోడ్ అమల్లో ఉన్నప్పుడు  ప్రభుత్వ  నిధులు దుర్వినియోగం కాకుండా చూడాలని కోరామన్నారు.రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాలోని  అసైన్డ్ భూముల రికార్డులను మార్చివేస్తున్నారని ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆరోపించారు. 


 

 

Follow Us:
Download App:
  • android
  • ios